
కుక్కలు వీధుల్లో కనిపించకుండా చూడాలని, వాటిని పునరావాస కేంద్రాలకు తరలించాలనే సుప్రీం కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన వారితో పాటు తీవ్రంగా అభ్యంతరం చెప్పినవారు ఎంతోమంది ఉన్నారు. ఈ నేపథ్యంలో మూగజీవులైన వీధికుక్కలు మాట్లాడుతున్నట్లు క్రియేట్ చేసిన వీడియోలు నెట్‌లోకంలో హల్‌చల్ చేస్తున్నాయి. కంటెంట్ క్రియేటర్ షిరిన్ సెవనీ శునకవేషధారణతో, శునకంలా మాట్లాడిన వీడియోకు మంచి స్పందన వచ్చింది.
ఆమె వీధికుక్కల తరఫున వకాల్తా పుచ్చుకుంది. ‘వీధికుక్కలు కనిపించకుండాపోతే ఏం జరుగుతుంది?’ కాప్షన్‌తో సుమిత్ మిత్రా అనే కంటెంట్ క్రియేటర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ వీడియోను పోస్ట్ చేశాడు.
కొందరు క్రియేటర్‌లు ఏఐ–జనరేటెడ్ వీడియోలతో వీధి శునకాలతో మాట్లాడించారు. అలాంటి ఒక వీడియోలో ఒక శునకం గట్టిగా ఇలా నినాదం ఇస్తుంది.... ‘వీధుల్లో ఉండడం అనేది వీధి కుక్కలుగా మా ప్రాథమిక హక్కు’ ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర ఒక కోతి గన్‌మైక్‌తో శునకాన్ని ఇంటర్వ్యూ చేస్తున్న వీడియో, బాలుడికి, శునకానికి మధ్య జరిగిన సంభాషణ... ఇలాంటి వీడియోలు ఎన్నో బాగా పాపులర్ అయ్యాయి.
(చదవండి: కుటుంబం దూరమై... శునకాలే కుటుంబమై!)