గోనె సంచుల కొరత తీరేనా? | - | Sakshi
Sakshi News home page

గోనె సంచుల కొరత తీరేనా?

Nov 7 2025 7:06 AM | Updated on Nov 7 2025 7:06 AM

గోనె

గోనె సంచుల కొరత తీరేనా?

చినిగిన గోనె సంచులే

న్యూస్‌రీల్‌

చినిగిన గోనె సంచులే

శురకవారం శ్రీ 7 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

సాక్షి ప్రతినిధి, ఏలూరు: చినిగిన సంచులు... సంచుల కోసం పడిగాపులు.. మిల్లర్ల దయాదాక్షిణ్యా లపై గోనె సంచులు.. జిల్లాలో అన్నదాతలకు గత రబీ సీజన్‌లో ఎదురైన అనుభవం ఇది. మళ్లీ అవే పరిస్థితులు కొనసాగే ప్రమాదముంది. అసలే మోంథా తుపాను ధాటికి పంట నష్టంతో అల్లాడుతున్న రైతులకు కొత్తగా గోనె సంచుల సమస్య మొదలైంది. జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌కుగాను 1.15 కోట్ల సంచులు అవసరం ఉండగా 70 లక్షలు మాత్రమే అందుబాటులో ఉండటం, అవి కూడా రీసైక్లింగ్‌ సంచులే కావడంతో ఈ సీజన్‌లో సంచుల కొరత వెంటాడే పరిస్థితి ఉంది.

పదేపదే అదే మాట

వచ్చే సీజన్‌ నాటికి 1.50 కోట్లు గోనె సంచులు కొనుగోలు చేస్తాం.. ఎక్కడా రైతులకు ఇబ్బంది అనేదే లేకుండా చేస్తామని గత రెండు, మూడు సీజన్‌లలో జిల్లా ఇన్‌చార్జి, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ మొదలు జాయింట్‌ కలెక్టర్‌ వరకు ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడిచినా ఒక్క గోనె సంచి కూడా కొత్తవి కొనుగోలు చేయని పరిస్థితి. జిల్లాలో ప్రస్తుతం 1,95,875 ఎకరాల్లో వరి సాగవుతోంది. ఈ సీజన్‌ లో 234 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని ప్ర భుత్వం సేకరించనుంది. సొసైటీలకు చినిగిన గోనె సంచులు రావడంతో గత సీజన్‌లో రైతులు ఇబ్బందులకు గురయ్యారని, ఈ సీజన్‌కు కూడా అదే విధంగా పంపిస్తే ఇబ్బందులు తప్పవని మంగళవారం జరిగిన డీసీసీబీ మహాజన సభలో సొసైటీ అధ్యక్షులు, కార్యదర్శులు అధికారులకు, అధ్యక్షులకు తెలిపారు.

మోంథా తుపానుతో ఆలస్యం

జిల్లాలో ఇప్పటికే ధాన్యం కొనుగోలు ప్రారంభం కావాల్సి ఉన్నా మోంథా తుపాను తాకిడికి వరిచేలు నేలకొరిగాయి. రైతులు పంటలు విక్రయించే సమయానికి తుపాను కారణంతో తీవ్రంగా నష్టపోయారు. ఇదిలా ఉండగా వచ్చే వారంలో జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రారంభించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో 6.20 లక్షల టన్నుల దిగుబడికి గాను 3.50 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్ణయించారు. అయితే లక్ష్యం పూర్తవుతుందో లేదోననేది సందేహమే.

అన్నదాతల గోస

చినిగిన సంచులే మళ్లీ దిక్కా!

జిల్లాలో వెంటాడుతున్న సమస్య

1.15 కోట్ల గన్నీ బ్యాగ్స్‌ అవసరం

70 లక్షలు అందుబాటులో ఉన్నట్టు ప్రకటన

చినిగిన గోతాలు ఇస్తున్నారంటూ సొసైటీల ఫిర్యాదు

వచ్చే వారం నుంచి ధాన్యం కొనుగోళ్లకు సన్నాహాలు

జిల్లాలో ఇప్పటికే గోనె సంచులు అందుబాటులో ఉంచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో చినిగిన, నలిగిన గోనె సంచులను సొసైటీలకు అందించారని పలు ఫిర్యాదులు వచ్చాయి. జిల్లావ్యాప్తంగా కోటికి పైగా గోనె సంచులు అవసరం కాగా ప్రస్తుతం 65 లక్షల నుంచి 70 లక్షల వరకు ధాన్యం కొనుగోలుకు అందుబాటులో ఉన్న ట్లు అధికారులు చెబుతున్నారు. గోనె సంచులకు ఎ టువంటి సమస్య లేదని అధికారులు చెబుతున్నా.. సంచుల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో గోనె సంచుల విషయంలో రైతు లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సంచుల కొరత ఉందని పలుమార్లు ఫిర్యాదులు సైతం చేశా రు. వచ్చే వారంలో ధాన్యం కొనుగోలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మరలా ఇదే సమస్య ఉత్పన్నమవుతుందననే ఆందోళనలో రైతులు ఉన్నారు. ప్రస్తుతం జిల్లాలో 108 రైస్‌ మిల్లుల్లో గోనె సంచులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు స్ప ష్టం చేశారు. ధాన్యం మాసూళ్లు ఎక్కడైతే ప్రారంభమవుతాయో ఆ ప్రాంతంలో ఆయా మిల్లర్ల వద్ద నుంచి గోనె సంచులను పంపించి, మిగిలిన చోట్ల కోతలు ప్రారంభమయ్యాక అవే గోనె సంచులను తిరిగి ఆ రైతులకే అందించేందుకు ఇలా రీసైక్లింగ్‌ పద్ధతిలో గోనె సంచులను రైతులకు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటి కే పాతవి కావడం, వాడిన గోనె సంచులనే మళ్లీ మళ్లీ వాడటంతో గోనె సంచుల్లో నాణ్యతా ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితి.

గోనె సంచుల కొరత తీరేనా? 1
1/1

గోనె సంచుల కొరత తీరేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement