రాష్ట్రంలో కుంటుపడిన ప్రజారోగ్యం
ఏలూరు టౌన్: కూటమి పాలనలో రాష్ట్రంలో ప్రజారోగ్యం కుంటుపడిందని, ప్రభుత్వ వైద్య రంగాన్ని సీఎం చంద్రబాబు నిర్వీర్యం చేసేలా కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ అన్నారు. ఏలూరు నియోజకవర్గంలో 19, 20 డివిజన్ల పరిధిలో హనుమాన్‌నగర్ బ్రిడ్జి ప్రాంతంలో ఫిషరీస్ కార్యాలయం సమీపంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు. వలంటీర్ల విభాగం జిల్లా అధ్యక్షురాలు భోగిశెట్టి పార్వతి, ఐటీ వింగ్ ఏలూరు నగర కార్యదర్శి పిల్లంగోళ్ల సత్యదేవ్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జయప్రకాష్ మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఐదేళ్లపాటు ప్రజారంజక పాలన సాగిందనీ, ప్రజలకు విద్య, వైద్యాన్ని చేరువ చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. అయితే కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు అత్యంత దారుణంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటం దుర్మార్గం అన్నారు. ప్రజల ఆరోగ్యం గాలిలో దీపంలా మారిందని, ప్రజలు ప్రభుత్వాస్పత్రులకు వెళ్లాలంటే భయపడేలా ఉందని ఆరోపించారు. ప్రజలు కూటమి నేతల కుటిల రాజకీయాలను గమనిస్తున్నారనీ, సరైన బుద్ధి చెబుతారన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్‌బాబు, జిల్లా అధికార ప్రతినిధి మున్నల జాన్‌గురునాథ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, రాష్ట్ర కార్యదర్శి దాసరి రమేష్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు ఇనపనూరి జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గ ఇన్‌చార్జి జయప్రకాష్


