నగల షాపు ప్రారంభోత్సవంలో అపశృతి | - | Sakshi
Sakshi News home page

నగల షాపు ప్రారంభోత్సవంలో అపశృతి

Jun 14 2025 7:31 AM | Updated on Jun 14 2025 7:31 AM

నగల షాపు ప్రారంభోత్సవంలో అపశృతి

నగల షాపు ప్రారంభోత్సవంలో అపశృతి

ఏలూరు టౌన్‌: ఏలూరు కొత్త బస్టాండ్‌ ప్రాంతంలో నగల దుకాణం ప్రారంభోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. ప్రారంభోత్సవానికి సినీనటులు రావడంతో అభిమానులు ఎగబడ్డారు. తోపులాటలో ఇంజనీరింగ్‌ విద్యార్థి అభిషేక్‌ కాలు విరిగింది. అతడిని జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించడంతో వాహనదారులు, నగర ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. స్కూల్స్‌, కాలేజీలు వదిలే సమయం కావటంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

నేటి నుంచి సముద్రంలో వేట

నరసాపురం: సముద్రంలో వేట నిషేధకాలం గడువు నేటి అర్ధరాత్రితో ముగుస్తుంది. 61 రోజులు పాటు ఖాళీగా ఉన్న గంగపుత్రులు మళ్లీ వేటకు వెళ్లనున్నారు. గత ఏడాది ప్రకృతి విపత్తులతో వేట సవ్యంగా సాగలేదు. సీజన్‌లో కూడా తీరానికి బోట్లు చేర్చడంతో ఏడాది పొడవునా నష్టాలే చవిచూశారు. ఈ ఏడాదైనా ప్రకృతి కరుణించాలని వేట ముమ్మరంగా సాగాలని గంగమ్మను వేడుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement