
రెండు బైక్‌ల ఢీ.. ఒకరి మృతి
ముసునూరు: రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన కాట్రేనిపాడు – చిల్లబోయినపల్లి రహదారిలో చోటుచేసుకుంది. ఎస్సై ఎం చిరంజీవి తెలిపిన వివరాల ప్రకారం.. తాపీ పని పురమాయించుకునేందుకు శనివారపు పేటకు చెందిన బయ్యారపు జమాల్(39), మణికంఠ బైక్ మీద కాట్రేనిపాడు వైపునకు వస్తుండగా ఎదురుగా వస్తున్న నూజివీడు మండలం అన్నవరంకు చెందిన వ్యక్తి మోటార్‌సైకిల్ ఢీకొంది. ఈ ప్రమాదంలో బయ్యారపు జమాల్ అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు తీవ్రగాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఏలూరు జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఏలూరు ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ఇద్దరికి గాయాలు