
అర్జీల పరిష్కారంపై దృష్టి
ఏలూరు(మెట్రో): అర్జీదారుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారిని గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. సోమవారం ఏలూరు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అర్జీదారుల నుంచి 226 దరఖాస్తులు స్వీక రించారు. విభిన్న ప్రతిభావంతులు, దివ్యాంగులు వద్దకు కలెక్టర్ స్వయంగా వెళ్లి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను తెలుసుకుని చర్యలకు ఆదేశించా రు. అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, ఆర్డీఓ అచ్యుత అంబరీష్, డీఆర్‌డీఏ పీడీ ఆర్.విజయరాజు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం.ముక్కంటి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.భాస్కర్ కలెక్టర్‌తో కలిసి వినతులు స్వీకరించారు.
అర్జీల్లో కొన్ని..
● పెదవేగి మండలం న్యాయంపల్లి గ్రామానికి చెందిన కొమ్మిన వెంకటేశ్వరరావు తమ భూసమస్యపై అర్జీని అందజేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
● ఏలూరు హనుమాన్‌నగర్‌కి చెందిన కుక్కర రమాదేవి అర్జీనిస్తూ తన భర్త నరసింహారావు ఆనారోగ్యంతో మరణించినందున తన జీవనోపాధి కోసం పెన్షన్ మంజూరు చేయాలని కోరారు.
● భీమడోలు మండలం ఎంఎం పురానికి చెందిన బుంగ చందర్రావు అర్జీనిస్తూ తన చేపల చెరువుకు సంబంధించి తనకు ఉన్న భూమి కన్నా తక్కువ ఆన్‌లైన్‌లో నమోదైందని, పరిశీలించి మొత్తం భూమి ఆన్‌లైన్‌లో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలను కోరారు.
● కై కలూరు మండలం ఆలపాడు చెందిన సుందర కనకదుర్గ అర్జీనిస్తూ తమ భూమి అడంగల్‌లో నమోదు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
● ఏలూరు పవర్‌పేటకు చెందిన పిల్ల హరినారాయణరావు అర్జీనిస్తూ దెందులూరు మండలం సోమవరప్పాడులో భీష్మపురి కాలనీలో తమ ప్లాట్ సర్వే చేసి అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కలెక్టర్ వెట్రిసెల్వి