
ఫిర్యాదులపై వేగంగా విచారణ
ఏలూరు (టూటౌన్): ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో అందిన ఫిర్యాదులపై వేగంగా విచారణ చేపట్టి చట్టపరంగా న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్‌లో భాగంగా 36 ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఎస్పీ ఆదేశించారు. ఏఎస్పీ ఎన్.సూర్యచంద్రరావు పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని..
● కై కలూరుకి చెందిన ఓ మహిళ తన నుంచి రూ.4 లక్షలు తీసుకుని ఓ వ్యక్తి మోసం చేశాడని ఫిర్యాదు చేశారు.
● జంగారెడ్డిగూడేనికి చెందిన ఓ మహిళ తన భర్త మరో మహిళను వివాహం చేసుకుని తనను ఇబ్బంది పెడుతున్నట్టు ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు.
● చాట్రాయి పరిధిలో ఓ వ్యక్తి తనను ఆస్తి విషయాల్లో కొందరు చంపుతానని బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు.
● మండవల్లి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఆస్తి సంబంధ విషయాలపై తన అన్న, వదిన బెదిరిస్తున్నారని ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు.