పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ

May 5 2025 8:34 AM | Updated on May 5 2025 7:25 PM

పెద్ద

పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ

కై కలూరు: సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు కొల్లేటికోట పెద్దింట్లమ్మను అమ్మను ఆదివారం దర్శించుకున్నారు. కోనేరులో స్నానాలు ఆచరించి అమ్మవారికి వేడి నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఆదివారం ఒక్క రోజు ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూల అమ్మకం, గదుల అద్దెలు, అమ్మవారి ఫొటోల ద్వారా మొత్తం రూ.61,105 ఆదాయం వచ్చిందని తెలిపారు.

గుబ్బల మంగమ్మ గుడికి పోటెత్తిన భక్తులు

బుట్టాయగూడెం: మండలంలోని కామవరం సమీపంలోని అటవీప్రాంతంలో కొలువైన గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వాహనాలతో తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం 8 గంటల సమయంలో భారీ వర్షం కురవడంతో మంగమ్మ దర్శనానికి వచ్చిన భక్తులు తడిసి ముద్దయ్యారు.

యోగా చాంపియన్‌కు సత్కారం

తాడేపల్లిగూడెం (టీఓసీ): రెండో ఆసియా యోగాసన చాంపియన్‌షిప్‌ పోటీలలో ఇటీవల బంగారు పతకం సాధించిన భీమవరానికి చెందిన బాలం శిరీషను ఆదివారం తాడేపల్లిగూడెం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠంలో ఆరా పౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు, నేషనల్‌ యోగాసన కోచ్‌ కరిబండి రామకృష్ణ, యోగా సభ్యులు ఘనంగా సత్కరించారు. ఆయన మాట్లాడుతూ బాలం శిరీష కఠోరమైన దీక్షతో బంగారు పతకం సాధించడం పలువురికి ఆదర్శప్రాయం అన్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

పెదవేగి: బైక్‌ అదుపుతప్పి పాల వ్యాన్‌ను ఢీ కొట్టిన ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పెదవేగి మండలం కొప్పులవారిగూడెం గ్రామానికి చెందిన ఓ రైతు డెయిరీ ఫాంలో బిహార్‌కు చెందిన చందన్‌ యాదవ్‌, మనోజ్‌ యాదవ్‌లు 45 రోజులుగా పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి కొప్పులవారిగూడెం నుంచి వేగివాడలో ఉన్న స్నేహితులను కలిసేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. ముండూరు సమీపంలో బైక్‌ అదుపుతప్పి పాల వ్యాన్‌ను ఢీ కొట్టింది. ప్రమాదంలో చందన్‌ యాదవ్‌ (25) అక్కడికక్కడే మృతిచెందగా మనోజ్‌ యాదవ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రామకృష్ణ చెప్పారు.

పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ  
1
1/2

పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ

పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ  
2
2/2

పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement