
తవ్వేయ్.. తరలించేయ్
యథేచ్ఛగా మట్టి తవ్వకాలు
బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలంలో అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. రోజూ రాత్రి వేళల్లో ఏదోక గ్రామంలో పొక్లెయిన్‌ల ద్వారా మట్టిని తవ్వి ట్రాక్టర్లతో తరలిస్తూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. పేదల గృహ నిర్మాణాలకు మట్టి రవాణాకు అనుమతి ఇవ్వని అధికారులు.. అక్రమార్కులు కొండలు, గుట్టలు తవ్వి మట్టి తరలిస్తూ కోట్లు గడిస్తున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బుట్టాయగూడెం మండలం కె.బొత్తప్పగూడెం సమీపంలో నూతనంగా నిర్మించనున్న ఓ పెట్రోల్ బంక్ స్థలం వద్దకు చింతలపూడి ఎత్తిపోతల పథకం గట్టును కొల్లగొట్టి కొందరు మట్టిని తరలిస్తున్నారు. అధికారులు స్పందించి మట్టి తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.