
గొంతుకోసుకుని వ్యక్తి ఆత్మహత్య
భీమవరం: భీమవరం పట్టణంలో మతిస్థిమితం లేని వ్యక్తి చాకుతో గొంతుకోసుకుని మృతిచెందాడు. ఉండి గ్రామం పెదపేటకు చెందిన గాతల క్రాంతికుమార్(35) కొంతకాలంగా మానసికంగా ఇబ్బందిపడుతున్నాడు. శుక్రవారం పనికి వెళ్లిన క్రాంతికుమార్ అక్కడ పడిపోవడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి శనివారం భీమవరం ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం కుటుంబసభ్యులు తీసుకువెళ్లగా.. దెయ్యాలు వస్తున్నాయంటూ వైద్యానికి సహకరించలేదు. దీంతో ఇంటికి తీసుకు వెళ్తుండగా అంబేడ్కర్ సెంటర్‌కు వచ్చే సరికి యనమదుర్రు డ్రెయిన్‌లోకి దూకాడు. వెంటనే బయటకు తీయగా అక్కడే పండ్లు అమ్ముతున్న వ్యక్తి నుంచి చాకు తీసుకుని పరుగులు పెడుతూ ఒంటిపై గాయాలు చేసుకున్నాడు. ఉండి రోడ్డులోని మల్టీఫ్లెక్స్ వద్దకు వెళ్లేసరికి గొంతు కోసుకున్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి జాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూటౌన్ ఎస్సై ఇజ్రాయిల్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
షార్ట్ సర్క్యూట్‌తో బస్సు దగ్ధం
కై కలూరు: బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ వల్ల స్కూల్ బస్సు దగ్ధమైన ఘటన కై కలూరు మాత ఇంగ్లీషు మీడియం స్కూల్ గ్రౌండ్‌లో శనివారం మధ్యాహ్నం జరిగింది. వేసవి సెలవులు కావడంతో బస్సు గ్రౌండ్‌లో ఉంచారు. బస్సు నుంచి పొగలు రావడంతో స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఫైర్ ఆఫీసర్ క్రాంతికుమార్ సిబ్బందితో హుటాహుటిన వచ్చి మంటలను అదుపు చేశారు. రూ.3 లక్షలకు పైగా నష్టం జరిగి ఉండవచ్చని భావిస్తున్నామన్నారు.
కొబ్బరి చెట్టుకు మంటలు
కై కలూరు: మండవల్లి మండలం చావలిపాడు రైల్వేగేటు సమీపంలో జమ్ము గడ్డికి నిప్పంటుకుని కొబ్బరి చెట్టు మొదలు వరకు మంటలు వ్యాపించాయి. సమీపంలో ఇళ్లతో పాటు ఐస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. కై కలూరు అగ్నిమాపక అధికారి సకాలంలో మంటలు అదుపు చేశారు. కలిదిండి పోలీసు స్టేషన్ వెనక భాగంలో కిక్కిస పొదలలో మంటలు వ్యాపించగా.. అగ్నిమాపక అధికారులు మంటలను ఆర్పివేశారు.

గొంతుకోసుకుని వ్యక్తి ఆత్మహత్య

గొంతుకోసుకుని వ్యక్తి ఆత్మహత్య