
బాలికల భవితకు ‘కిశోరి వికాసం’
ఏలూరు(మెట్రో): యుక్త వయసులో ఉన్న బాలికలు, మహిళల ఉజ్వల భవిష్యత్‌కు కిశోరి వికాసం కార్యక్రమం దోహదపడుతుందని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. కౌమార బాలికల సాధికారత లక్ష్యంగా జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన కిశోరి వికాశంపై వాల్‌పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నుంచి వచ్చేనెల 10 వరకు పలు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. జిల్లాలోప్రత్యేక సమ్మర్ క్యాంపెయిన్ గ్రామ, వార్డు స్థాయిలో ఆరు అంశాలను చర్చిస్తూ ముందుకు సాగేలా పుస్తకాలను రూపొందించామన్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి పి.శారద, జిల్లా బాలల సంరక్షణా అధికారి సీహెచ్ సూర్య చక్రవేణి, డీపీహెచ్‌ఎన్‌ఓ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
జిల్లావ్యాప్తంగా ప్రారంభం
ఏలూరు (టూటౌన్): జిల్లావ్యాప్తంగా కిశోరి వికాసం కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. ఏలూరులోని 12 పంపుల సెంటర్‌లోని సచివాలయ పరిధిలో వేసవి శిక్షణ శిబిరాన్ని జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ సాధికారత అధికారి పి.శారద, అధికారులు సందర్శించారు.