
కండక్టర్ కుటుంబానికి రూ.1.08 కోట్ల పరిహారం
రాజోలు: గత ఏడాది ఊడిమూడి శివారులో ధాన్యం ట్రాక్టర్‌ను ఆర్టీసీ బస్సు ఢీ కొన్న ప్రమాదంలో మృతి చెందిన కండక్టర్ కేఎస్ రావు కుటుంబానికి ఆర్టీసీ జోన్–2 ఈడీ విజయరత్నం రూ.1.08 కోట్లు చెక్కును శుక్రవారం అందజేశారు. కండక్టర్ భార్య కె.గంగాభవానికి ఈ చెక్కును అధికారులు అందజేశారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ పబ్లిక్ లయబిలిటీ ఫండ్ (ఈడీపీఎల్‌ఈ) ద్వారా ఈ పరిహారం వచ్చింది. ఆర్టీసీ ఉద్యోగులకు సంస్థ అండగా నిలుస్తుందని ఈడీ అన్నారు. డీపీటీఓ ఎస్‌పీపీ రాఘవకుమార్, డిపో మేనేజర్ పి.ధనమ్మ, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.