
ఆలయ అభివృద్ధికి రూ.5.50 లక్షల విరాళం
ఆలమూరు: చింతలూరులో వేంచేసి ఉన్న నూకాంబిక అమ్మవారి ఆలయ అభివృద్ధికి దాతలు విరాళాలు అందిస్తున్నారు. అమ్మవారి ఆలయంలో ప్రస్తుతం జరుగుతున్న రాజగోపురాల నిర్మాణం కోసం తమ వంతు సాయంగా మండపేటకు చెందిన పారిశ్రామికవేత్త వంక సాయికుమార్ బాబు గురువారం దేవదాయ శాఖకు రూ.5.50 లక్షల విరాళాన్ని అందజేశారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ మాజీ చైర్మన్లు అల్లంరాజు రామకృష్ణమూర్తి, వైట్ల శేషుబాబు, నీటి సంఘం చైర్మన్ వైట్ల గంగరాజు, గన్ని వెంకట్రావు పాల్గొన్నారు.