
శ్రీరాముని చిత్రం
గండేపల్లి: పెన్సిల్‌తో పలురకాల చిత్రాలను గీస్తూ ఆ విద్యార్థి మన్ననలు పొందుతున్నాడు. మండలంలోని సూరంపాలెం ప్రగతి ఇంజినీరింగ్ కళాశాలలో ఈఈఈ 4వ సంవత్సరం చదువుతున్న పెంకే కృష్ణస్వామి శ్రీరామ నవమి సందర్భంగా పెన్సిల్‌తో శ్రీరాముడు, ఆంజనేయుని చిత్రాలు గీసి వాటికి రంగులు అద్దాడు. పెన్సిల్ ముల్లుపై ఆంజనేయుని రూపాన్ని తీర్చిదిద్దాడు.
ముగిసిన ఇంటర్ పరీక్షలు
ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం): ఈ నెల 15న ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని 140 కేంద్రాల్లో ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఇంటర్మీడియెట్ బోర్డు ఆర్‌ఐవో ఎన్‌ఎస్‌వీఎల్ నరసింహం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం రసాయనశాస్త్రం –2, వాణిజ్యశాస్త్రం–2 పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. జనరల్ విభాగంలో 42,120 మందికి 40,856 మంది హాజరవగా, 1,264 మంది గైర్హాజరయ్యారని వివరించారు. బుధవారం తుని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పరీక్ష కేంద్రంలో ఒక మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు అయిందన్నారు.

పెన్సిల్ ముల్లుపై ఆంజనేయ విగ్రహం

కృష్ణస్వామి