
రావులపాలెంలో మాట్లాడుతున్న సైకిల్ యాత్రికుడు గోపాలకృష్ణ
రావులపాలెం: దేశంలో శాంతిని నెలకొల్పాలని దేవుళ్లను ప్రార్థిస్తూ సైకిల్‌పై యాత్ర చేసుకుంటూ ఆయా పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటున్న కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా సింధనూరుకు చెందిన విజయ్ గోపాలకృష్ణ బుధవారం రావులపాలెం చేరారు. స్థానిక రింగ్ రోడ్డు సెంటర్లో ఆయన తన యాత్ర విశేషాలను శ్రీసాక్షిశ్రీకి వివరించారు. 2022 మార్చి 11న సింధనూరులో సైకిల్ పై ప్రారంభమైన యాత్ర అక్కడి నుంచి దాదాపు 13 రాష్ట్రాల మీదగా సాగిందన్నారు. ఉదయం మొదలుపెట్టి, మధ్యాహ్న సమయంలో కాస్త విశ్రాంతి తీసుకుని, మరలా యాత్రను కొనసాగిస్తున్నట్టు వివరించారు. ఇప్పటివరకు ఘానాపూర్, తుల్బాపూర్, షిరిడి, నాసిక్, త్రయంబకేశ్వరం, కాశి, అయోధ్య, అగ్రా, లక్నో, మధుర, హరియానా, పంజాబ్, తిరుపతి, రామేశ్వరం మంత్రాలయం ప్రాంతాల్లో ఆలయాలను దర్శించుకున్నానని చెప్పారు. వాడపల్లి వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళుతున్నట్టు గోపాలకృష్ణ తెలిపారు.