వాడపల్లి క్షేత్రంలో టెండర్లు
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రానికి వివిధ సామగ్రి సరఫరా, పాత సామగ్రి తీసుకువెళ్లేందుకు ఏడాది కాలానికి గురువారం వేలం, టెండర్లు నిర్వహించారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో సిబ్బంది టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. గృహ సంకల్పం కింద ఇటుకల పాటను దొడ్డ లక్ష్మణరావు రూ.59,09,999కు దక్కించుకున్నారు. గతంలో ఈ టెండరు ద్వారా రూ.35,66,999 రాగా ఈ సారి రూ. 23,43,000 ఆదాయం పెరిగింది. దేవస్థానం పచ్చి గో గ్రాసం అమ్ముకునే హక్కును అడపా వరప్రసాద్ రూ.10,09,999కు దక్కించుకున్నారు. గత ఏడాది దీనికి రూ.1.25 లక్షల ఆదాయం రాగా ఈసారి రూ.8,84,999 అదనంగా ఆదాయం వచ్చింది. గుమ్మటాలుకు సంబంధించి గత శిస్తు రూ.2,14,999 ఆదాయం రాగా ప్రస్తుతం రూ.75,333 వచ్చింది. ఆ విధంగా ఈసారి రూ 1,39,666 ఆదాయం తగ్గింది. 26 షాపులకు పాట పెట్టగా అందులో ఐదు మాత్రమే వేలానికి వెళ్లాయి. వాటిని రూ.50,709కు పొందారు. గత ఏడాది కంటే ఈసారి రూ.5,300 ఆదాయం పెరిగింది. ఆలయంలో సెక్యూరిటీ సేవలు శ్రీస్కంధ బౌన్సర్లు రూ.వెయ్యికి, శ్రీకృష్ణప్రసాద్ రూ.369కి టెండరు పొందారు. కార్యక్రమంలో గ్రేడ్ – 3 ఈఓ ఎం.సత్యనారాయణ, దేవస్థానం సిబ్బంది తధితరులు పాల్గొన్నారు.


