పిచ్చి కుక్క దాడిలో 21 మందికి గాయాలు
పి.గన్నవరం: మండలంలోని ఏనుగుపల్లి, వై.కొత్తపల్లి, పి.గన్నవరం పరిసర గ్రామాల్లో రెండు రోజలుగా ఒక పిచ్చి కుక్క స్వైర విహారం చేస్తోంది. కనిపించిన వారిని కరుస్తూ పారిపోతుండటంతో ప్రజలు భయాందోన చెందుతున్నారు. బుధవారం 14 మందిని, గురువారం ఏడుగురిని గాయ పరచింది. దీంతో వారంతా పి.గన్నవరం సీహెచ్‌సీకి వచ్చి వైద్యం చేయించుకున్నారు. ఇంకా ఆస్పత్రిలో నలుగురు వ్యక్తులు చికిత్స పొందుతున్నారు. పిచ్చి కుక్క పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య, సిబ్బంది హెచ్చరించారు.
రైలు నుంచి జారిపడి
వ్యక్తి మృతి
తుని: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక జీఆర్పీ ఎస్సై జి.శ్రీనివాసరావు గురువారం తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. అన్నవరం రైల్వేస్టేషన్, యార్డ్ రైల్వేగేటు మధ్య సుమారు 40 ఏళ్ల వ్యక్తి రైలు నుంచి జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. మృతదేహాన్ని తుని ఏరియా ఆసుపత్రిలో భద్రపరిచారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు 94906 19020 నంబరుకు ఫోన్ చేయాలని కోరారు.


