ఓవరాల్ చాంపియన్స్ జీఎస్‌ఎల్
రాజానగరం: స్థానిక జీఎస్‌ఎల్ వైద్య కళాశాల క్రీడా మైదానంలో డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని మెడికల్, డెంటల్ కాలేజీలకు నిర్వహించిన అంతర్ కళాశాలల క్రీడా పోటీలు (పురుషులు) 2025లో ‘ఓవరాల్ చాంపియన్ షిప్’ను స్థానిక జీఎస్‌ఎల్ క్రీడాకారులు కై వసం చేసుకున్నారు. రెండు దశలలో జరిగిన ఈ పోటీలు గురువారం సాయంత్రంతో ముగిశాయి. ఫుట్‌బాల్, చెస్, బ్యాడ్మింటన్ పోటీలలో జీఎస్‌ఎల్ విద్యార్థులు విజేతలుగా నిలువగా, కబడ్డీ, లాన్ టెన్నిస్‌లలో విజయవాడకు చెందిన ఎస్‌ఎమ్‌సి జట్లు ఆధిపత్యం చూపాయి. అత్యుత్తమ ప్రతిభ కనబర్చడం ద్వారా ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను దక్కించుకున్న విజతలకు జీఎస్‌ఎల్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు షీల్డ్ అందజేశారు.


