మత్స్యకార యువకుడి గల్లంతు
కాకినాడ క్రైం: మోంథా తుపాను కారణంగా సముద్ర అలల ఉధృతికి కాకినాడకు చెందిన ఓ మత్స్యకార యువకుడు గల్లంతయ్యాడు. వివరాలలోకెళితే కాకినాడ దుమ్ములపేటకు చెందిన 21 ఏళ్ల జి.సాయిరాం తన బోట్‌ను కాకినాడలోని కుంభాభిషేకం తీరంలో లంగర్ వేసి ఉంచాడు. సముద్రలోని అలల ఉధృతితో లంగర్ తెగి బోట్ సముద్రంలోకి వెళ్లిపోయే అవకాశం ఉందని గ్రహించి ఏటిమొగ కల్వర్టు వద్దకు తన బోట్‌ను తరలించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో కుంభాభిషేకం తీరంలో లంగర్ వేసి ఉన్న బోట్‌పైకి ఎక్కి లంగర్ తాడును లాగబోతూ ప్రమాదవశాత్తూ సముద్రంలోకి జారిపడి గల్లంతయ్యాడు. సహ మత్స్యకారులు గాలించినా ప్రయోజనం లేకపోయింది. కుటుంబ సభ్యులు కాకినాడ పోర్టు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సాయిరాంకు భార్య, కుమారుడు ఉన్నారు.


