రైల్వే గేటు వద్ద గుర్తు తెలియని మృతదేహం
సామర్లకోట: స్థానిక ఉండూరు రైల్వే గేటు సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గమనించారు. కాకినాడ రైల్వే ఎస్సై వాసంశెట్టి సతీష్ కథనం ప్రకారం.. రైల్వే ట్రాక్‌మాన్ సమాచారం మేరకు ఉండూరు రైల్వే గేటు సమీపంలో 25 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి ఒంటిపై నీలం రంగు జీన్ ఫ్యాంట్, గ్రే, నలుపు రంగు టీ షర్టు ఉంది. ఎటువంటి ఆధారాలు లభించక పోవడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మరిన్ని వివరాల కోసం 94949 02914 ఫోన్ నంబరులో సంప్రదించాలన్నారు.
వచ్చే నెలలో అథ్లెటిక్స్ పోటీలు
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఇంటర్ కాలేజీయెట్ అథ్లెటిక్స్ మెన్ అండ్ ఉమెన్ చాంపియన్ షిప్ పోటీలు నవంబర్ 10, 11వ తేదీల్లో రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీలో జరుగుతాయని వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ తెలిపారు.
ఇందుకు సంబంధించిన బ్రోచర్‌ను శనివారం విడుదల చేశారు. ఈ అథ్లెటిక్స్‌లో 26 రకాల క్రీడా పోటీలు ఉంటాయని, అన్నింటినీ సమర్థవంతంగా నిర్వహించాలని సిబ్బందికి సూచనలిచ్చారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ, రిజిస్టార్ ఆచార్య కేవీ స్వామి, అసిస్టెంట్ సెక్రటరీ డాక్టర్ ఎంవీఎస్‌ఎన్ మూర్తి, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్రరావు, ఆర్గనైజింగ్ మెంబర్లు ఎం.ప్రసాద్, పీవీవీ లక్ష్మి, టి.విజయదుర్గ తదితరులు పాల్గొన్నారు.
రైల్వే గేటు వద్ద గుర్తు తెలియని మృతదేహం


