ఏడు వారాల స్వామీ.. మనసా స్మరామి
ఫ వాడపల్లి క్షేత్రంలో భక్తజన సంద్రం
ఫ ఒక్కరోజే రూ...... లక్షల ఆదాయం
కొత్తపేట: భక్తుల కోరిన కోర్కెలు తీరుస్తూ ఏడు వారాల వెంకన్నగా ప్రసిద్ధికెక్కిన వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రం శనివారం భక్తజనంతో కోలాహలంగా మారింది. రాష్ట్రం నలుమూలల నుంచీ భక్తులు వాడపల్లి క్షేత్రానికి భారీగా తరలివచ్చారు. కొందరు స్వామివారిని దర్శించుకునేందుకు కాలినడకన చేరుకున్నారు. ఏడు ప్రదక్షిణలు చేస్తున్న వేలాది మంది భక్తులతో మాడ వీధులు, స్వామి దర్శనానికి క్యూలైన్లు నిండిపోయాయి. ఏడుకొండల వాడా.. గోవిందా.. గోవింద నామస్మరణతో క్షేత్రం మార్మోగింది. దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో సిబ్బంది ఏర్పాట్లు చేశారు. స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు ఉదయం సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం తదితర పూజాధికాలు నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా సుగంధ పరిమళ పుష్పాలతో విశేషంగా అలంకరించారు. శ్రీవేంకటేశ్వర సహిత ఐశ్వర్యలక్ష్మీ హోమం నిర్వహించారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో వేంచేసియున్న అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తుల విశిష్ట దర్శనం, ప్రత్యేక దర్శనం, వేదాశీర్వచనం, ఆన్‌లైన్, నిత్య, శాశ్వత అన్నదానం విరాళాలు, లడ్డు విక్రయం తదితర రూపాల్లో ఈ ఒక్కరోజు రాత్రి – గంటల వరకూ దేవస్థానానికి రూ. – లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ చక్రధరరావు తెలిపారు. ధర్మపథం కార్యక్రమంలో భాగంగా రాత్రి వివిధ ప్రాంతాలకు చెందిన నృత్య కళాకారుల బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన చేసింది.


