విజా్ఞన కౌశలం
● కౌశల్
క్విజ్ పోటీలకు వేళాయె
● ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేకం
● సైన్స్‌పై ఆసక్తిని పెంచడమే లక్ష్యం
రాయవరం: విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు వివిధ రకాల పోటీలు నిర్వహిస్తూంటాయి. వాటిలో భారతీయ విజ్ఞాన మండలి(బీవీఎం), ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి (ఏపీ కాస్ట్) సంయుక్త ఆధ్వర్యంలో ఏటా జరిపే కౌశల్ క్విజ్ పోటీలు ఒకటి. వీటిని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాత్రమే నిర్వహిస్తారు. పిల్లల్లో సైన్స్ పరిజ్ఞానాన్ని తెలుసుకోవడం, భావి శాస్త్రవేత్తలను తయారు చేయడం ఈ పోటీల ప్రధాన లక్ష్యం. ఇటీవల కౌశల్ సైన్స్ 2025 పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్థుల వివరాలు పంపించేందుకు ఈ నెల 24 తేదీని గడువుగా నిర్ణయించారు.
వీరందరూ అర్హులే..
అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 8, 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులందరూ కౌశల్ క్విజ్ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులే. సదరు విద్యార్థులు ప్రత్యేకంగా క్విజ్ టీమ్‌గా ఏర్పాటు కావాలి. తొలుత అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సైన్స్ సబ్జెక్టుల టీచర్ల ద్వారా విద్యార్థులను ఎంపిక చేయాలి. తద్వారా ఈ పోటీకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 8, 9, 10 తరగతుల్లోని సైన్స్, గణితం సబ్జెక్టులపై కౌశల్ క్విజ్ పోటీ ఉంటుంది. అదే విధంగా ‘విజ్ఞాన శాస్త్ర రంగంలో భారతీయుల కృషి’ అనే అంశంపై సేకరించిన మెటీరియల్‌ను విద్యార్థులు అధ్యయనం చేయాలి.
బహుమతులు
విజేతలైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలతో పాటు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తారు. నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను ప్రదానం చేస్తారు. జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతిగా రూ.7,500, ద్వితీయ బహుమతిగా రూ.6 వేలు, తృతీయ బహుమతిగా రూ.4,500, కన్సొలేషన్ బహుమతుల కింద రూ.3 వేలు అందజేస్తారు. జిల్లా స్థాయిలో ఎంపికై న వారిని రాష్ట్ర స్థాయి పోటీకి పంపిస్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతిగా రూ.15 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.12 వేలు, తృతీయ బహుమతిగా రూ.9 వేలు అందించనున్నారు. రాష్ట్ర స్థాయిలో కన్సొలేషన్ బహుమతులుగా రూ.6 వేల వంతున ఎంపిక చేసిన కొందరికి ప్రదానం చేస్తారు.
ఈ నెల 24 తుది గడువు
ఎంపిక చేసిన విద్యార్థుల వివరాలను పాఠశాలల కో ఆర్డినేటర్లు ఈ నెల 24వ తేదీ లోపు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీవీఎంఏపీ.ఓఆర్‌జీలో రిజిస్ట్రేషన్ చేయాలి. 8వ తరగతి విద్యార్థులకు ‘వికసిత భారత్ కొరకు సుస్థిర మరియు హరిత ఇంధన వనరులు’, 9వ తరగతి విద్యార్థులకు ‘సత్యేంద్రనాఽథ్ బోస్ జీవితం మరియు ఆయన చేసిన కృషి’ థీమ్‌తో పోస్టర్ కాంపిటీషన్ నిర్వహించనున్నారు. అన్ని ప్రభుత్వ యాజమాన్యాల్లోని 8, 9 తరగతుల నుంచి ఇద్దరు వంతున ఎంపిక చేసిన విద్యార్థులతో పోస్టర్ కాంపిటీషన్ జరుగుతుంది.
పరీక్ష షెడ్యూల్
కౌశల్ సైన్స్ క్విజ్ ప్రాథమిక స్థాయి ఆన్‌లైన్ పరీక్షను నవంబర్ 1న 8వ తరగతికి, 3న తొమ్మిదో తరగతికి, 4న 10వ తరగతికి నిర్వహిస్తారు. జిల్లా స్థాయి పోటీలకు సంబంధించి 8, 9 తరగతులకు నవంబర్ 27న, 10వ తరగతికి 28న జరుగుతుంది. రాష్ట్ర స్థాయి పోటీల తేదీని తర్వాత ప్రకటిస్తారు. రాష్ట్ర స్థాయి విజేతలకు రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా బహుమతులు అందజేయనున్నారు. మరిన్ని వివరాలకు జిల్లా కో ఆర్డినేటర్ ఎంఎన్ సూర్యనారాయణ 99086 67536 నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.
క్విజ్ టీమ్ కోసం పాఠశాల స్థాయిలో 8, 9, 10 తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న పాఠశాలల్లో 8, 9, 10 తరగతుల నుంచి కనీసం ఒక్కరు, గరిష్టంగా 10 మంది వరకు ఈ ప్రాథమిక పరీక్ష రాయవచ్చు. మొబైల్, ట్యాబ్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ ద్వారా రాయవచ్చు. తరగతిలో టాపర్‌గా నిలిచిన విద్యార్థి పాఠశాల క్విజ్ టీమ్ సభ్యుడిగా ఎంపిక చేయబడతాడు. ఈ మూడు తరగతుల విద్యార్థుల మార్కులను కలిపి పాఠశాల మార్కు నిర్ణయిస్తారు. తరగతి వారీగా పరీక్ష నిర్వహిస్తారు. ఇలా జిల్లాలో మొదటి 36 స్థానాల్లో ఉన్న పాఠశాలలు జిల్లా స్థాయి ఆఫ్‌లైన్ క్విజ్‌కు అర్హత పొందుతాయి.
పోటీతత్వం పెరుగుతుంది
కౌశల్ సైన్స్ క్విజ్ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనే విధంగా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి. దీని ద్వారా విద్యార్థుల్లో సైన్స్‌పై ఆసక్తి మరింత పెరుగుతుంది. వారిలో పోటీతత్వం అలవడుతుంది.
– షేక్ సలీం బాషా, డీఈవో, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి
జిల్లాకు మంచి పేరు తీసుకు వచ్చేలా ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కౌశల్ క్విజ్ పోటీలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. అధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేయించాలి. దీని కోసం విద్యార్థులను సిద్ధం చేయాలి.
– జీవీఎస్ సుబ్రహ్మణ్యం, జిల్లా సైన్స్ అధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
విజా్ఞన కౌశలం
విజా్ఞన కౌశలం
విజా్ఞన కౌశలం


