గతం కంటే తగ్గింది
గతంలో దీపావళి సీజన్‌లో 20 వేల వరకు ప్రమిదలను విక్రయించేవారు. సంప్రదాయ ప్రమిదలపై నేటి తరం ఆసక్తి చూపడం లేదు. నేడు ఐదు వేల ప్రమిదలు కూడా విక్రయించడం లేదు. హోల్‌సేల్‌గా రూ.1.50 నుంచి రూ.2కు విక్రయిస్తున్నారు. బయట మార్కెట్‌లో ఇది రూ.15 నుంచి రూ.20 చేసి విక్రయిస్తున్నారు. తయారీదారులకు ఈ మొత్తం గిట్టుబాటు కావడం లేదు.
– కాపవరపు మల్లేశ్వరరావు, నంగవరం, ఉప్పలగుప్తం మండలం
వైరెటీ ప్రమిదలకు ఆదరణ
దీపావళి పండుగ సందర్భంగా వైరెటీ ప్రమిదల వ్యాపారం చేస్తున్నా. కోనసీమలో కుమ్మరి తయారుచేసే ప్రమిదల కంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే ప్రమిదలకు ఆదరణ పెరిగింది. అమలాపురంలో హోల్‌సేల్ వ్యాపారి వద్ద తెచ్చి వీటిని అమ్ముతున్నాం. ఎక్కువమంది వీటినే కొంటున్నారు. డజను ప్రమిదలు రూ. 30 నుంచి రూ.60 వరకు అమ్ముతున్నాం.
– చింతలపూడి ప్రశాంత్ కుమార్, ఫ్యాన్సీ వ్యాపారి, అమలాపురం
గతం కంటే తగ్గింది
గతం కంటే తగ్గింది


