జిల్లాలో భారీ వర్షం
సాక్షి, అమలాపురం: నైరుతి నిష్క్రమణ తరుణంలో జిల్లాలో సోమవారం భారీ వర్షం కురిసింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం 11 గంటల వరకూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. జిల్లా వ్యాప్తంగా ఉదయం 8 గంటల వరకు సగటున 10.4 మిల్లీమీటర్ల వర్షం పడగా అత్యధికంగా అయినవిల్లి మండలంలో 25 మిల్లీమీటర్లు, అత్యల్పంగా కాట్రేనికోన మండలంలో 0.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 8 గంటల తరువాత కూడా వర్షం పడుతూనే ఉంది. అమలాపురంలో ప్రధాన రోడ్లపై నీరు నిలిచిపోయింది. ఆత్రేయపురం మండలంలో 4.8 మిల్లీమీటర్లు, మండపేట 5.0, రాయవరం 3.0, రామచంద్రపురం 12.4, ఆలమూరు 10.2, రావులపాలెం 19.2, కొత్తపేట 14, కపిలేశ్వరపురం 4.2, కె.గంగవరం 7, ఐ.పోలవరం 16.8, ముమ్మిడివరం 10.2, అయినవిల్లి 25, పి.గన్నవరం 12.6, అంబాజీపేట 15.8, మామిడికుదురు 13.2, రాజోలు 5.8, మలికిపురం 7.6, సఖినేటిపల్లి 0.6, అల్లవరం 6.2. అమలాపురం 9.2, ఉప్పలగుప్తం 12.4, కాట్రేనికోన 14.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.


