
ప్రభుత్వం సహకరిస్తే మరిన్ని పతకాలు
ఆటలు నేర్పడం కాదు. ఏ ఆటలో ఎవరు నిష్ణాతులు కాగలరో గుర్తించి శిక్షణ ఇవ్వాలి. అంతే కాకుండా వారిని ప్రోత్సహించి విద్యార్థిలో ఉన్న క్రీడా స్ఫూర్తిని వెలికితీస్తే జాతీయ స్థాయి క్రీడాకారులు తయారవుతారు. విద్యార్థుల్లో ఉన్న క్రీడాసక్తిని వెలుగులోకి తేవడం ద్వారా వారిని మంచి క్రీడాకారులుగా తయారు చేయడానికి ప్రభుత్వ ప్రోత్సాహం ఎంతైనా అవసరం. ప్రభుత్వం పోల్‌వాల్ట్ క్రీడకు మంచి ప్రాధాన్యం ఇచ్చి అన్ని సౌకర్యాలు కల్పిస్తే మరింత మంది క్రీడాకారులు తయారై రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకువస్తారు. పోల్‌వాల్ట్‌లో రవి మంచి ప్రతిభ చూపుతున్నాడు. ప్రతి పోటీలోను తన సత్తా చాటుతూ పతకాలను సాధిస్తున్నాడు. రానున్న రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో ఆడేలా కృషి చేస్తున్నాడు.
– ఎలిపే సునీల్ దేశాయ్, కోచ్, పిఠాపురం