పోల్‌ పడితే పతకమే! | - | Sakshi
Sakshi News home page

పోల్‌ పడితే పతకమే!

Jun 25 2025 1:39 AM | Updated on Jun 25 2025 1:39 AM

పోల్‌

పోల్‌ పడితే పతకమే!

పోల్‌వాల్ట్‌లో రాణిస్తున్న

పిఠాపురం క్రీడాకారుడు రవి

కొద్దిపాటి వసతులతోనే కఠోర శిక్షణ

రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు

పిఠాపురం: అతడు పోల్‌ పట్టాడంటే పతకం రావాల్సిందే. ఎటువంటి సౌకర్యాలు లేకున్నా ఉన్న కొద్దిపాటి వసతులతో దృఢ సంకల్పం, పట్టుదలతో శిక్షణ తీసుకుని తొలి ప్రయత్నాలలోనే రాష్ట్ర, జాతీయ స్థాయి పతకాలను కొల్లగొడుతున్నాడు. తక్కువ కాలంలో ఏకంగా 15 స్వర్ణ, 2 రజత, 3 కాంస్య పతకాలు సాధించిన ఘనత అతడి సొంతం. పిఠాపురం విద్యార్థి పోల్‌వాల్ట్‌లో ఉత్తమ క్రీడాకారుడిగా ప్రతిభ చూపుతున్నాడు. డిగ్రీ చదువు పూర్తిచేసి ఉన్నత విద్య కోసం సాగుతూనే పోల్‌వాల్ట్‌లో ప్రతిభ చూపుతున్నాడు సాలా రవి.

పతకాల వేటలో పోటీలేదు..

తొమ్మిదో తరగతి నుంచి పోల్‌వాల్ట్‌లో పట్టు సాధించిన రవి జాతీయ స్థాయిలో రాష్ట్రం తరఫున హైదరాబాద్‌, చైన్నె, కేరళ, కరీంనగర్‌, బెంగళూరు, పూణే, పంజాబ్‌, జార్ఖండ్‌ తదితర ప్రాంతాల్లో పోటీల్లో పాల్గొని ఎన్నో పతకాలు కై వసం చేసుకున్నాడు. జాతీయ స్థాయిలో కరీంనగర్‌, గుంటూరు, కేరళ తదితర ప్రాంతాల్లో జరిగిన క్రీడల్లో పాల్గొని ప్రశంసలు అందుకున్నాడు.

అంతర్జాతీయ పతకమే లక్ష్యం

పోల్‌వాల్ట్‌లో అంతర్జాతీయ పోటీల్లో గెలవాలన్నదే లక్ష్యంగా కృషి చేస్తున్నాను. మా కోచ్‌ ఎలిపే సునీల్‌ దేశాయ్‌. తమలో క్రీడా ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించడం వల్లే ఇన్ని పతకాలు సాధించాను. చిన్నప్పుడు తమ పాఠశాలలో సీనియర్లు పోల్‌వాల్ట్‌ ఆడుతుంటే చూసి నాకూ ఆడాలనిపించింది. కోచ్‌ సునీల్‌ దేశాయ్‌కు ఆ క్రీడపై ఆసక్తిని వివరించాను. దీంతో ఆయన తనను ప్రోత్సహించి క్రీడలో మెళకువలు నేర్పించారు. సరైన సౌకర్యాలు లేకపోయినా మంచి ఫలితాలను సాధించేలా శిక్షణ ఇచ్చారు.

– సాలా రవి, పోల్‌వాల్ట్‌ క్రీడాకారుడు, పిఠాపురం

పోల్‌ పడితే పతకమే!1
1/2

పోల్‌ పడితే పతకమే!

పోల్‌ పడితే పతకమే!2
2/2

పోల్‌ పడితే పతకమే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement