Fake Baba At Uttarakhand: భూత వైద్యం పేరుతో మహిళను లొంగదీసుకొని.. ఆ తర్వాత.. 

Fake Baba Harassed By Woman At Uttarakhand - Sakshi

దేశంలో ఏదో ఒక చోట మహిళలు వేధింపులకు, అత్యాచారాలకు గురవుతూనే ఉన్నారు. తాజాగా దెయ్యాలు, భూతాల పేరుతో ఓ దొంగ బాబా.. 19ఏళ్లుగా మహిళపై లైంగిక దాడులకు పాల్పడుతున్నాడు. ఈ షాకింగ్‌ ఘటన ఉ‍త్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. బాధితురాలు కరన్​పుర్​లో నివాసం ఉండేది. కాగా, ఆమె 14 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు అనారోగ్యానికి గురికావడంతో అదే ప్రాంతంలో ఉండే పరమానంద పురి అలియాస్ ప్రవీణ్ గుజ్రాల్ అనే బాబా వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో ఆమెను ఆత్మల పేరుతో భయపెట్టి ఆరోగ్యం బాగుచేస్తానని నమ్మించాడు. అనంతరం కూల్​డ్రింక్​లో మత్తు మందులు కలిపి ఆమెపై అత్యాచారం చేశాడు. అయితే, 2006లో సదరు దొంగ బాబా ఆ ప్రాంతం వదిలి డెహ్రాడూన్‌కు వెళ్లిపోయాడు. అనంతరం 2012లో ఆమెకు ఓ మానసిక రోగితో వివాహం జరిపించాడు.  కానీ, ఆమెతో మాత్రం సంబంధం కొనసాగించాడు. తాజాగా ఆమె కుతూళ్లపై దొంగ బాబా కన్నేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. 

ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ.. దీవెనెల పేరుతో ప్రవీణ్‌ గుజ్రాల్‌ తనను అనుచితంగా తాకేవాడని తెలిపింది. బాబా ఇచ్చే ఔషధాల వల్ల తనకు చాలా సార్లు అబార్షన్ అయిందని వాపోయింది. 2021 మే నెలలో తన కూతుళ్లతో బాబా కన్నేసి లైంగికంగా వేధింపులకు గురిచేశాడని ఆరోపించింది. తన వద్ద నుంచి బాబా రూ.40 లక్షలు తీసుకున్నాడని చెప్పుకొచ్చింది. 

ఆమె ఆరోపణలపై గుజ్రాల్ స్పందిస్తూ.. మహిళ తనను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. బాధితురాలి ఆరోపణలను కొట్టిపారేశాడు. ఇదిలా ఉండగా గతంలోనూ బాబాపై మహిళ ఇలాగే ఆరోపణలు చేసినట్లు సమాచారం. కాగా, ఆమె ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టినట్టు తెలిపారు 

ఇది కూడా చదవండి: కట్నం కోసం బంధువులతో అత్యాచారం.. వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసి.. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top