
సాక్షి, కర్నూలు : నగరంలోని వన్‌టౌన్ ఏరియాలో విషాదం చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కుటుంబంలోని నలుగురు మృత్యుఒడిలోకి చేరుకున్నారు. మృతులలో దంపతులు ప్రతాప్, హేమలత వారి పిల్లలు జయంత్, రిషిత ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.