
సూర్యప్రభపై అభయం
కాణిపాకం: ప్రత్యేక ఉత్సవాలను పురస్కరించుకుని కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి మంగళవారం సూర్యప్రభ వాహనంపై అభయమిచ్చారు. ఉదయం స్వామికి ప్రత్యేక అభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. రాత్రి ఉత్సవ మూర్తునలు ప్రత్యేకంగా అలంకరించి సూర్యప్రభ వాహనంపై అధిష్టింపజేశారు. అనంతరం స్వామిని మంగళవాయిద్యాల నడుమ మూడ వీధుల్లో ఊరేగించారు. భక్తులు కర్పూర హారతులు పట్టి మొక్కులు చెల్లించుకున్నారు.
నేడు చంద్రప్రభ వాహన సేవ
కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఉత్సవ మూర్తులు బుధవారం చంద్ర ప్రభ వాహనంపై ఊరేగుతూ కటాక్షించనున్నారు. ఉదయం అభిషేకం, రాత్రి చంద్రప్రభ వాహన సేవ ఉంటుందని ఆలయ ఈవో పెంచలకిషోర్ తెలిపారు.
అలరించిన నాట్యం
శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అబ్బురపరిచాయి. నాటక, గీతాలపానలు, కూచిపూడి, భరతనాట్యం కళాకారుల ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. ధార్మికోపనాస్యం, హరికథ ఆకట్టుకుంది.
సూర్యప్రభ వాహనంపై స్వామివారు
అలరించిన కళాకారిణి

సూర్యప్రభపై అభయం