Zomato IPO: తెగ తినేస్తున్నా..! ఫౌండర్‌ ట్వీట్‌ వైరల్‌

Zomato IPO Founder Deepinder Goyal "Stress Eating" tweet viral - Sakshi

"ట్రిపుల్ బ్రేక్ ఫాస్ట్ ఆర్డర్ చేశా.. స్ట్రెస్  ఈటింగ్‌’’  గోయల్

ఆల్ ది బెస్ట్  అంటున్న సహచర వ్యాపారులు

సాక్షి, ముంబై: ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో  ఐపీవో ప్రారంభం సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ ట్వీట్‌ వైరల్‌గా మారింది.  ఐపీవో ఒత్తిడిలో మూడు సార్లు బ్రేక్‌ ఫాస్ట్‌ ఆర్డర్‌ చేశానంటూ గోయల్‌ ట్వీట్‌ చేశారు.  ఈ ట్వీట్‌పై స్పందించిన పలువురు పరిశ్రమ పెద్దలు గోయల్‌కి అభినందనలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.

"జొమాటోలో ట్రిపుల్ బ్రేక్ ఫాస్ట్ ఆర్డర్ చేశా.. స్ట్రెస్ ఈటింగ్‌’’ అంటూ గోయల్ ట్వీట్ చేశారు. దీనిపై మరో వ్యాపారవేత్త, ప్ర‌ముఖ ఆన్‌లైన్‌ పేమెంట్స్ సంస్థ పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ స్పందించారు. సూపర్‌ లిస్టింగ్‌ మేన్‌.. శుభాకాంక్షలు దీపి అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. పేటీఎం కూడా త్వరలోనే ఐపీవోకు రానుంది. అలాగే గోయల్‌కు ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ కామ్వివా మొబైల్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా జసుజా , ఎడెల్వీస్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ సీఈఓ రాధిక గుప్తా ట్వీట్‌ చేశారు. దీంతోపాటు నా క్కూడా ధక్‌ ధక్‌ మంటోంది అంటూ  జొమాటో అధికార ట్విటర్‌ ఖాతా కూడా ట్వీట్‌ చేయడం విశేషం.

కాగా దేశంలో ఒక  ఫుడ్‌ టెక్‌  కంపెనీ ఐపీవోకు రావడం ఇదే తొలిసారి.  రూ. 9,375 కోట్ల సేకరించే లక్క్ష్యంతో పప్రారంభమైన  జొమాటో  ఐపీవో  ఈనెల 16న ముగియనుంది. జొమాటో ఇష్యూ ప్రైస్‌బాండ్‌ ఒక్కో షేరుకు రూ.72-76గా కంపెనీ నిర్ణయించింది. సుమారు186 యాంకర్ పెట్టుబడిదారుల నుండి, ఇప్పటికే  4,196.51 కోట్ల రూపాయలను జొమాటో సేకరించిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top