ఎంత పనిచేశావు ఎలన్‌మస్క్‌..! నీ రాక..వారికి శాపమే..!

Volkswagen Considering Cutting Up To 30,000 Jobs Handelsblatt - Sakshi

Volkswagen Considering Cutting Up To 30,000 Jobs Handelsblatt: బెర్లిన్‌: ప్రపంచవ్యాప్తంగా కర్భన ఉద్గారాలను తగ్గించడం కోసం పలు ఆటోమొబైల్‌ కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీపై దృష్టిసారించాయి. ఇప్పటికే టెస్లా లాంటి కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలో ముందంజలో ఉన్నాయి. ఫోక్స్‌వేగన్‌, మెర్సిడెజ్‌, బీఎమ్‌డబ్ల్యూ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీపై దృష్టి పెట్టాయి. 

ఉత్పత్తి వేగంగా చేయకపోతే..!
గత నెల బోర్డు సమావేశంలో జర్మనీ ఆటోమొబైల్‌ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తి వేగంగా జరకపోతే జర్మనీలో పనిచేసే 30 వేల మంది ఉద్యోగాలు కచ్చితంగా కోల్పోయే అవకాశం ఉందని కంపెనీ సీఈవో హెర్బర్‌ డైస్‌ హెచ్చరించినట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  డైస్ ప్రకటనను మొదటిసారిగా  ఆ దేశ పత్రిక హ్యాండెల్స్‌బ్లాట్ నివేదించింది.
చదవండి: మార్కెట్లోకి కొత్త కారు.. తెగ కొనేస్తున్న బాలీవుడ్‌, టాలీవుడ్‌ స్టార్స్‌

టెస్లా ఎంట్రీతో...! కంపెనీలో అనూహ్య పరిమాణాలు..!
కొద్ది రోజుల క్రితం  ప్రముఖ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా జర్మనీలో గిగా ఫ్యాక్టరీను నెలకొల్పనున్నట్లు ఎలన్‌ మస్క్‌ పేర్కొన్నారు. దీంతో టెస్లా రాకతో ఆటోమొబైల్‌ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్‌ కంపెనీలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. టెస్లా నుంచి పోటీని ఎదుర్కోవడం కోసం ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తి వేగంగా చేయాలని ఫోక్స్‌వ్యాగన్‌ సీఈవో డైస్‌ కంపెనీ ఉద్యోగులకు తెలిపారు. ఫోక్స్‌వ్యాగన్‌ వోల్ఫ్స్‌బర్గ్ ప్లాంట్‌లో సుమారు 25 వేల మంది ఉద్యోగులతో కేవలం 700,000 కార్లను ఉత్పత్తి  మాత్రమే చేస్తుంది. మరోవైపు జర్మనీలో సంవత‍్సరానికి 5 లక్షల కార్లను 12 వేల మంది ఉద్యోగులతో ఉత్పత్తి చేయాలని టెస్లా లక్ష్యంగా పెట్టుకుంది.  

ఉద్యోగుల్లో అలజడి..!
ఫోక్స్‌వ్యాగన్‌ సీఈవో చేసిన వ్యాఖ్యలపై కంపెనీలో ఉద్యోగుల్లో  తీవ్ర చర్చకు దారితీసింది. ఫోక్స్‌వ్యాగన్‌ కార్మికుల మండలి ప్రతినిధి మాట్లాడుతూ...డైస్ ఈ వ్యాఖ్యలు చేశాడా లేదా అనే దానిపై  అసలు స్పందించలేదు. కానీ 30వేల ఉద్యోగుల తొలగింపు అసంబద్ధం, నిరాధారమైనదని అన్నారు.
చదవండి: భారత్‌ ముందు చిన్నబోయిన అగ్రరాజ్యం..! ఇండియన్స్‌తో మామూలుగా ఉండదు..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top