వివో నుంచి రెండు కొత్త ఫోన్లు | Vivo Expands 5G Lineup in India with Launch of Y21 and Y11 | Sakshi
Sakshi News home page

వివో నుంచి రెండు కొత్త ఫోన్లు

Mar 29 2026 8:29 AM | Updated on Mar 29 2026 8:31 AM

Vivo Expands 5G Lineup in India with Launch of Y21 and Y11

న్యూఢిల్లీ: వివో ఇండియా కొత్తగా రెండు 5జీ స్మార్ట్‌ ఫోన్స్‌ని ఆవిష్కరించింది. వై21, వై11 వీటిలో ఉన్నా యి. వై 21 5జీ ధర రూ. 18,999 నుంచి, వై11 5జీ రేటు రూ. 14,999 నుంచి ప్రారంభమవుతుంది. నిర్దిష్ట బ్యాంక్‌ కార్డులతో వై21పై రూ. 1,500 వరకు, వై11పై రూ. 1,000 వరకు క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ ఉంటుంది.

రెండు డివైజ్‌లలో 6500 ఎంఏహెచ్‌ బ్యాటరీలు, 6.74 అంగుళాల స్క్రీన్లు, మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్లు, ఆరిజిన్‌ ఓఎస్‌6 ఆపరేటింగ్‌ సిస్టం తదితర ఫీచర్లు ఉన్నాయి. వై21లో 50 ఎంపీ రియర్‌ కెమెరా, వై11లో 13 ఎంపీ రియర్‌ కెమెరా ఉంటాయి. వివో ఇండియా ఈ–స్టోర్, ఈకామర్స్‌ ప్లాట్‌ఫాంలు, పార్ట్‌నర్‌ రిటైల్‌ స్టోర్స్‌లో ఇవి లభిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement