క్లచ్‌తో పనిలేకుండా గేర్లు మార్చుకునే బైక్‌ | Honda Motorcycle And Scooter India Launches New Honda NX500 With Advanced E-Clutch Technology In India, Details Inside | Sakshi
Sakshi News home page

ఈ–క్లచ్‌ టెక్నాలజీతో హోండా ఎన్‌ఎక్స్‌ 500

May 14 2026 12:01 AM | Updated on May 14 2026 11:18 AM

Updated Honda NX500 Launched with E Clutch Details here

ఎక్స్‌ షోరూం వద్ద ధర రూ. 7,43,900 

డీలర్‌ఫిప్‌లలో బుకింగ్స్‌ ప్రారంభం 

గురుగ్రామ్‌: హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) తన పాపులర్‌ అడ్వెంచర్‌ టూరర్‌ మోడల్‌ ‘ఎన్‌ఎక్స్‌500’ను సరికొత్త ఈ–క్లచ్‌ టెక్నాలజీతో మార్కెట్లోకి విడుదల చేసింది. క్లచ్‌తో పనిలేకుండా గేర్లు మార్చుకునే వెసులుబాటు కల్పించే ఈ టెక్నాలజీ బైక్‌ రైడింగ్‌ అనుభవాన్ని సరికొత్తగా మార్చనుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆటోమేషన్‌ సాంకేతికతను భారత రైడింగ్‌ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించారు. దీని ధరను కంపెనీ రూ. 7,43,900 (ఎక్స్‌–షోరూమ్‌ వద్ద)గా నిర్ణయించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న హోండా బిగ్‌వింగ్‌ డీలర్‌షిప్‌లలో బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి.

ఇందులో 471 సీసీ, లిక్విడ్‌–కూల్డ్, ప్యారలల్‌–ట్విన్‌ ఇంజిన్‌ను 6–స్పీడ్‌ ట్రాన్స్‌మిషన్‌తో అమర్చారు. ఇది సిటీ రైడింగ్‌ హైవే టూరింగ్‌ రెండింటికీ అనువైన బలమైన టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫీచర్ల విషయానికొస్తే... 5.0 అంగుళాల పూర్తి రంగుల టీఎఫ్‌టీ (టీఎఫ్‌టీ) డిస్‌ప్లే ఉంది. ఇందులో నావిగేషన్, కాల్, మ్యూజిక్‌ ఫంక్షన్ల కోసం హోండా రోడ్‌సింక్‌ కనెక్టివిటీ లభిస్తుంది. భద్రత కోసం డ్యూయల్‌ ఛానల్‌ ఏబీఎస్, హోండా సెలెక్టబుల్‌ టార్క్‌ కంట్రోల్, పూర్తి ఎల్‌ఈడీ లైటింగ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్‌ మ్యాట్‌ గన్‌పౌడర్‌ బ్లాక్‌ మెటాలిక్, పెర్ల్‌ హోరిజోన్‌ వైట్‌ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది.

ఈ సందర్భంగా హెచ్‌ఎంఎస్‌ఐ అధ్యక్షుడు, సీఈఓ శ్రీ సుత్సుము ఒటాని మాట్లాడుతూ, ఈ–క్లచ్‌ సాంకేతికత పట్టణ, పర్యటన వాతావరణాలలో రైడర్‌ అలసటను తగ్గించి, సౌకర్యం, కంట్రోల్‌ను పెంచుతుందని ధీమా వ్యక్తం చేశారు. 

చ‌ద‌వండి: ఏడాది పాటు ప‌సిడి కొనొద్దు.. ప‌రిష్కారం ఇదిగో!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement