నెక్సాన్ కొత్త వేరియంట్ లాంచ్: ధర ఎంతంటే? | Tata Nexon Pure Plus PS Variant Launched | Sakshi
Sakshi News home page

నెక్సాన్ కొత్త వేరియంట్ లాంచ్: ధర ఎంతంటే?

May 9 2026 3:55 PM | Updated on May 9 2026 4:01 PM

Tata Nexon Pure Plus PS Variant Launched

టాటా మోటార్స్..  నెక్సాన్ ప్యూర్ ప్లస్ పీఎస్ వేరియంట్‌ను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ.9.59 లక్షలు (ఎక్స్ షోరూమ్). కంపెనీ పది లక్షల నెక్సాన్‌ల అమ్మకాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కొత్త వేరియంట్ లాంచ్ చేసింది.

టాటా నెక్సాన్ ప్యూర్ PS వేరియంట్.. రోజువారీ వినియోగానికి అనుకూలంగా ఉంటుంది. కంపెనీ అందుబాటు ధరకే ఇందులో అనేక ప్రీమియం ఫీచర్లను అందిస్తుంది. విశాలమైన, ఓపెన్ క్యాబిన్ అనుభూతిని కలిగించే వాయిస్ అసిస్టెడ్ పనోరమిక్ సన్‌రూఫ్, నిరంతరాయ కనెక్టివిటీ కోసం వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేలకు సపోర్ట్ చేసే 10.25-అంగుళాల హార్మన్ టచ్‌స్క్రీన్ ఉన్నాయి.

ఆరు-స్పీకర్ల ఆడియో సెటప్, క్రూజ్ కంట్రోల్, రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు కూడా ఈ కొత్త వేరియంట్లో ఉన్నాయి. ఆటో ఎల్ఈడీ హెడ్‌లైట్లు, డైనమిక్ గైడ్‌లైన్స్, పార్కింగ్ సెన్సార్‌లతో కూడిన HD రివర్స్ కెమెరా, ఆటో ఫోల్డ్ ఫంక్షనాలిటీతో కూడిన ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ORVMలు, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లు, పుష్-బటన్ స్టార్ట్ వంటివి కూడా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement