SEBI: 25 మంది జాడలేని డిఫాల్టర్లు

SEBI Published Untraceable Defaulter List - Sakshi

న్యూఢిల్లీ: క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా 25 మంది వ్యక్తులతో కూడిన డిఫాల్టర్ల జాబితాను విడుదల చేసింది. వీరంతా జాడలేని వారేనని సెబీ పేర్కొంది. సెక్యూరిటీల మార్కెట్లో వివిధ అక్రమాలకుగాను విధించిన జరిమానాలు చెల్లించడం లేదా ఇన్వెస్టర్ల సొమ్మును వాపసు చేయడంలో వీరంతా విఫలమైనట్లు సెబీ తెలియజేసింది. వెబ్‌సైట్‌లో వీరి వివరాలను పబ్లిష్‌ చేయడంతోపాటు.. రికవరీ సర్టిఫికెట్లను జారీ చేయనున్నట్లు వెల్లడించింది. 

తెలిస్తే చెప్పండి
రికవరీ అధికారుల ద్వారా జారీ చేసిన నోటీసులు చివర్లో నమోదైన చిరునామాల ద్వారా వీరికి అందలేదని పేర్కొంది. నోటీసులను 2014 జులై నుంచి 2022 జనవరి వరకూ జారీ చేసినట్లు తెలియజేసింది. ఈ నెల 24కల్లా వీరంతా రికవరీ అధికారులను లేఖలు లేదా ఈమెయిల్‌ ద్వారా సంప్రదించవలసి ఉన్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఈ జాబితాలోని వ్యక్తుల వివరాలు ఎవరికైనా తెలిస్తే రికవరీ అధికారికి 2022 మార్చి 24లోగా నివేదించమంటూ పబ్లిక్‌కు సూచించింది.  

ఇదీ జాబితా 
సెబీ విడుదల చేసిన జాడలేని డిఫాల్టర్ల జాబితాలో కనైయలాల్‌ జోషి, సంతోష్‌ కృష్ణ పవార్, చేతన్‌ మెహతా, ముకుంద్‌ యదు జంభాలే, అంకిత్‌ కే అగర్వాల్, జయేష్‌ షా, సురేష్‌ కుమార్‌ పి.జైన్, ప్రవీణ్‌ వసిష్ట్‌, రాజేష్‌ తుకారం డాంబ్రే, జయేష్‌ కుమార్‌ షా, దహ్యాభాయ్‌ జి.పటేల్, దాల్‌సుఖ్‌భాయ్‌ డి.పటేల్, విఠల్‌భాయ్‌ వి.గజేరా తదితరులున్నారు.
 

చదవండి: నష్టాల కంపెనీలకు సెబీ షాక్...!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top