జేబులో జ్యూసర్‌.. బాటిల్‌ బ్యాగ్‌! | Pocket Juicer Bottle Bag Summer Gadgets | Sakshi
Sakshi News home page

జేబులో జ్యూసర్‌.. బాటిల్‌ బ్యాగ్‌: ఇవిగో సమ్మర్ గ్యాడ్జెట్స్

Mar 29 2026 6:51 PM | Updated on Mar 29 2026 6:58 PM

Pocket Juicer Bottle Bag Summer Gadgets

మీ సమ్మర్‌ను రిఫ్రెషింగ్‌గా మార్చే ‘స్మార్ట్‌’ మ్యాజిక్‌ ఇదిగో! ఈ అదిరిపోయే గాడ్జెట్స్‌తో చెమటలకు గుడ్‌ బై చెప్పేసి, చిల్‌ అవ్వండి!

జేబులో జ్యూసర్‌!
ఆఫీసులో ఉన్నప్పుడైనా లేదా జిమ్‌ పూర్తి చేసొచ్చినా, బయట దొరికే షుగర్‌ డ్రింక్స్‌ తాగి విసిగిపోయారా? ఎక్కడున్నా సరే ‘ఫ్రెష్‌’గా జ్యూస్‌ చేసుకోవాలనుకుంటున్నారా? ఇందుకోసమే వచ్చేసింది ఈ రీచార్జబుల్‌ పోర్టబుల్‌ జ్యూసర్‌!

ఇది మామూలు మిక్సీ కాదు, మీరు ఎక్కడికి వెళ్లినా వెంట తీసుకెళ్లగలిగే ఒక మినీ మ్యాజిక్‌ బాటిల్‌! పైగా దీనికి వైర్లు లేదా ప్లగ్‌ పాయింట్లతో పనిలేదు. ఇందులో ఉన్న పవర్‌ఫుల్‌ బ్యాటరీని మీ మొబైల్‌ చార్జర్‌ లేదా పవర్‌ బ్యాంక్‌తో చార్జ్‌ చేసుకుంటే చాలు. ప్రయాణాల్లో ఉన్నా, క్యాంపింగ్‌లో ఉన్నా సెకన్లలో తాజా ఫ్రూట్‌ జ్యూస్‌లు, స్మూతీలు రెడీ అయిపోతాయి. జ్యూసర్‌ లీక్‌–ప్రూఫ్‌ డిజైన్‌తో వస్తుంది, కాబట్టి మీ బ్యాగ్‌లో పెట్టుకున్నా చిందుతుందనే భయం ఉండదు. ధర రూ. 570 మాత్రమే!

బాటిల్‌ బ్యాగ్‌!
బయటకి వెళ్ళినప్పుడు వాటర్‌ బాటిల్‌ను చేత్తో పట్టుకోలేక, బ్యాగ్‌లో పెడితే లోపల ఉన్న వస్తువులు తడిసిపోతాయని టెన్షన్‌ పడుతున్నారా? ఇకపై మీ బాటిల్‌ను స్టయిలిష్‌గా మోసుకెళ్లడానికి వచ్చేసింది ఈ వాటర్‌ బాటిల్‌ క్యారియర్‌ బ్యాగ్‌!

ఇందులో బాటిల్‌తో పాటు మీ ఫోన్, డబ్బులు లేదా తాళాలు పెట్టుకోవడానికి ఒక జిప్పర్‌ పాకెట్‌ కూడా ఉంటుంది. పైగా దీనికి ఉన్న అడ్జస్టబుల్‌ షోల్డర్‌ స్ట్రాప్‌ వల్ల ఎవరికైనా ఇట్టే సెట్‌ అయిపోతుంది. వాటర్‌ ప్రూఫ్‌ మెటీరియల్‌తో తయారు చేయడం వల్ల వర్షం పడినా మీ ఫోన్, బాటిల్‌ సేఫ్‌గా ఉంటాయి! ఆఫీసుకైనా, జిమ్‌కైనా లేదా ట్రావెలింగ్‌కైనా ఈ బ్యాగ్‌ మీకు మంచి క్లాసీ లుక్‌ను ఇస్తుంది. 
ధర రూ. 500 మాత్రమే!

ఐస్‌ ముక్కల ‘మ్యాజిక్‌ కప్పు’!
ఫ్రిజ్‌లో ఉన్న ఐస్‌ ట్రే నుంచి ఐస్‌ ముక్కల్ని తీయడానికి కుస్తీ పడుతున్నారా? తీరా తీశాక అవి అక్కడక్కడా విరిగిపోయి చిరాకు తెప్పిస్తున్నాయా? అయితే మీకోసం వచ్చేసింది ఈ సిలికాన్‌ ఐస్‌ మేకర్‌ కప్పు!

ఇది మామూలు ఐస్‌ ట్రే కాదు, ఒక స్మార్ట్‌ సిలికాన్‌ సిలిండర్‌. ఇందులో నీళ్లు పోసి ఫ్రిజ్‌లో పెట్టుకుని ఐస్‌ తయారు చేసుకోవచ్చు. దీనికున్న చిన్న బటన్‌ నొక్కితే చాలు, అరవై చిన్న చిన్న ఐస్‌ ముక్కలు టకటకా రాలిపోతాయి! చూడటానికి కప్పులా చాలా చిన్నగా ఉంటూ, మీ ఫ్రిజ్‌లో అస్సలు చోటు ఆక్రమించదు. ఫుడ్‌ గ్రేడ్‌ సిలికాన్ తో తయారవ్వడం వల్ల చాలా సేఫ్, పైగా దీనికి ఉన్న మూత వల్ల ఫ్రిజ్‌లోని ఇతర వాసనలు ఐస్‌కు అంటుకోవు. ధర కేవలం రూ. 400 మాత్రమే!

Advertisement
 
Advertisement
Advertisement