Juicero
-
జేబులో జ్యూసర్.. బాటిల్ బ్యాగ్!
మీ సమ్మర్‌ను రిఫ్రెషింగ్‌గా మార్చే ‘స్మార్ట్’ మ్యాజిక్ ఇదిగో! ఈ అదిరిపోయే గాడ్జెట్స్‌తో చెమటలకు గుడ్ బై చెప్పేసి, చిల్ అవ్వండి!జేబులో జ్యూసర్!ఆఫీసులో ఉన్నప్పుడైనా లేదా జిమ్ పూర్తి చేసొచ్చినా, బయట దొరికే షుగర్ డ్రింక్స్ తాగి విసిగిపోయారా? ఎక్కడున్నా సరే ‘ఫ్రెష్’గా జ్యూస్ చేసుకోవాలనుకుంటున్నారా? ఇందుకోసమే వచ్చేసింది ఈ రీచార్జబుల్ పోర్టబుల్ జ్యూసర్!ఇది మామూలు మిక్సీ కాదు, మీరు ఎక్కడికి వెళ్లినా వెంట తీసుకెళ్లగలిగే ఒక మినీ మ్యాజిక్ బాటిల్! పైగా దీనికి వైర్లు లేదా ప్లగ్ పాయింట్లతో పనిలేదు. ఇందులో ఉన్న పవర్ఫుల్ బ్యాటరీని మీ మొబైల్ చార్జర్ లేదా పవర్ బ్యాంక్‌తో చార్జ్ చేసుకుంటే చాలు. ప్రయాణాల్లో ఉన్నా, క్యాంపింగ్‌లో ఉన్నా సెకన్లలో తాజా ఫ్రూట్ జ్యూస్‌లు, స్మూతీలు రెడీ అయిపోతాయి. జ్యూసర్ లీక్–ప్రూఫ్ డిజైన్‌తో వస్తుంది, కాబట్టి మీ బ్యాగ్‌లో పెట్టుకున్నా చిందుతుందనే భయం ఉండదు. ధర రూ. 570 మాత్రమే!బాటిల్ బ్యాగ్!బయటకి వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్‌ను చేత్తో పట్టుకోలేక, బ్యాగ్‌లో పెడితే లోపల ఉన్న వస్తువులు తడిసిపోతాయని టెన్షన్ పడుతున్నారా? ఇకపై మీ బాటిల్‌ను స్టయిలిష్‌గా మోసుకెళ్లడానికి వచ్చేసింది ఈ వాటర్ బాటిల్ క్యారియర్ బ్యాగ్!ఇందులో బాటిల్‌తో పాటు మీ ఫోన్, డబ్బులు లేదా తాళాలు పెట్టుకోవడానికి ఒక జిప్పర్ పాకెట్ కూడా ఉంటుంది. పైగా దీనికి ఉన్న అడ్జస్టబుల్ షోల్డర్ స్ట్రాప్ వల్ల ఎవరికైనా ఇట్టే సెట్ అయిపోతుంది. వాటర్ ప్రూఫ్ మెటీరియల్‌తో తయారు చేయడం వల్ల వర్షం పడినా మీ ఫోన్, బాటిల్ సేఫ్‌గా ఉంటాయి! ఆఫీసుకైనా, జిమ్‌కైనా లేదా ట్రావెలింగ్‌కైనా ఈ బ్యాగ్ మీకు మంచి క్లాసీ లుక్‌ను ఇస్తుంది. ధర రూ. 500 మాత్రమే!ఐస్ ముక్కల ‘మ్యాజిక్ కప్పు’!ఫ్రిజ్‌లో ఉన్న ఐస్ ట్రే నుంచి ఐస్ ముక్కల్ని తీయడానికి కుస్తీ పడుతున్నారా? తీరా తీశాక అవి అక్కడక్కడా విరిగిపోయి చిరాకు తెప్పిస్తున్నాయా? అయితే మీకోసం వచ్చేసింది ఈ సిలికాన్ ఐస్ మేకర్ కప్పు!ఇది మామూలు ఐస్ ట్రే కాదు, ఒక స్మార్ట్ సిలికాన్ సిలిండర్. ఇందులో నీళ్లు పోసి ఫ్రిజ్‌లో పెట్టుకుని ఐస్ తయారు చేసుకోవచ్చు. దీనికున్న చిన్న బటన్ నొక్కితే చాలు, అరవై చిన్న చిన్న ఐస్ ముక్కలు టకటకా రాలిపోతాయి! చూడటానికి కప్పులా చాలా చిన్నగా ఉంటూ, మీ ఫ్రిజ్‌లో అస్సలు చోటు ఆక్రమించదు. ఫుడ్ గ్రేడ్ సిలికాన్ తో తయారవ్వడం వల్ల చాలా సేఫ్, పైగా దీనికి ఉన్న మూత వల్ల ఫ్రిజ్‌లోని ఇతర వాసనలు ఐస్‌కు అంటుకోవు. ధర కేవలం రూ. 400 మాత్రమే! -
నిమిషం వీడియో.. వెయ్యి కోట్ల కంపెనీని ఎలా కూప్పకూల్చింది! గూగుల్ సైతం
ఒకే ఒక్క నిమిషం వీడియో దెబ్బకు ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్‌తో పాటు ఇతర కంపెనీలు రూ.1000 కోట్లు నష్టపోయేలా చేసింది. నమ్మడం లేదా? లేదంటే ఎందుకు? ఎలా అంటారా? జ్యూసెరో మెషిన్. ప్రపంచంలోనే స్మార్ట్ వైఫై యాప్ కోల్డ్ ఫెష్ జ్యూసర్. ఈ జ్యూసెరో మెషిన్ సాయంతో జ్యూస్ తయారు చేయాలంటే ఫ్రూట్స్ అవసరం లేదు. జస్ట్ ఆ కంపెనీ తయారు చేసిన జ్యూస్ ప్యాకెట్లు ఉంటే చాలు. ఆ ప్యాకెట్లను మెషిన్లో పెట్టి బటన్ నొక్కితే చాలు. మెషిన్లో నుంచి జ్యూస్ డైరెక్ట్‌గా గ్లాస్‌లోకి పడిపోతుంది. అనంతరం ఆ జ్యూస్‌ను తాగొచ్చు. ఇక ఈ కంపెనీ జ్యూస్ ప్యాకెట్లను సబ్స్క్రిప్షన్ ధర పొందాల్సి ఉంటుంది. డౌగ్ మాస్టర్ మైండ్ శాంపిల్ మెషిన్ తయారైంది. మరిన్ని జ్యూస్ మెషిన్లను తయారు చేసేందుకు, వాటిని మార్కెటింగ్ తయారు చేసేందుకు డబ్బులు కావాలి. అప్పుడు జ్యూసెరో ఫౌండర్ డౌగ్ ఎవాన్స్ తన మాస్టర్ మైండ్‌కి పదును పెట్టాడు. వెంటనే జ్యూసెరో మెషిన్ గురించి ప్రచారం చేశాడు. ప్రచారంతో ఊదర గొట్టాడు ఈ మెషిన్ తయారీ కోసం టెక్ కంపెనీలు టెస్లా, యాపిల్ తరహాలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేశామని చెప్పుకొచ్చాడు. యాపిల్ మాజీ కో-ఫౌండర్ స్టీవ్ జాబ్స్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ నుంచి యాపిల్ కంప్యూటర్ను ఎలా తయారు చేశారో నేను కూడా మెయిన్‌ఫ్రేమ్ జ్యూస్ మెషిన్ నుంచి జ్యూసెరో మెషిన్‌ను తయారు చేస్తున్నట్లు ఊదరగొట్టారు. ప్రొడక్ట్ వీక్.. పబ్లిసిటీ పీక్ ఎవాన్స్ పబ్లిసిటీ సూపర్ హిట్ అయ్యింది. గూగుల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు జ్యూసెరో కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు పోటీపడ్డాయి. ఫలితంగా రూ.1000 కోట్ల కంపెనీగా అవతరించింది. ఇంకేం చేతిలో పుష్కలంగా డబ్బులు.. జ్యూసెరో మెషిన్‌ను, జ్యూస్ ప్యాకెట్లను పెద్ద ఎత్తున తయారు చేసింది. జ్యూసెరో మెషిన్ ధరను రూ.30000 వేలు పైగా నిర్ణయించింది. ఫ్రూట్స్‌ను బట్టి జ్యూస్ ప్యాకెట్‌ను ధరను నిర్ణయించి మార్కెట్లోకి విడుదల చేసింది. మార్కెట్లోకి లాంచ్ అయిన కొద్దిరోజులు బాగానే ఉన్నా.. మెల్లిమెల్లిగా జ్యూసెరో చేసిన మోసం వెలుగులోకి రావడం మొదలైంది. ఆ సమయంలో మీడియా సంస్థ బ్లూమ్‌బెర్గ్ జ్యూసెరో మెషిన్ పనితీరును వివరిస్తూ నిమిషం వీడియోను ప్రసారం చేసింది. ఆ వీడియోలో జ్యూసెరో మెషిన్లో నుంచి జ్యూస్ రావడానికి ఎంత సమయం పడుతుంది. అదే జ్యూస్ ప్యాకెట్లను చేతులతో పిండితే ఎంత జ్యూస్ వస్తుందో అంతే సమయం పడుతుందని వివరించింది. ఆ వీడియో చూసిన వినియోగదారులు జ్యూసెరో మెషిన్‌ను కొనుగోలు చేయడం మానేశారు. పైగా మెషిన్ ఖరీదైందని, సంస్థ తయారు చేసిన జ్యూస్ ప్యాకెట్లు ఎంత కాలం నిల్వ ఉంటాయి. ప్యాకెట్లలో నిల్వ చేసిన జ్యూస్‌ను తాగొచ్చా? లేదా? ఇలా విషయాల గురించి కొనుగులో దారులు, వినియోగదారులు ఎవాన్స్‌ను నిలదీయడం మొదలు పెట్టారు. దీంతో సంస్థ అప్రతిష్టను మూటగట్టుకుంది. సేల్స్ ఆగిపోయాయి. ఉద్యోగులు ఒక్కొక్కరిగా వెళ్లిపోయారు. నష్టాలు రావడంతో సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి తలెత్తింది. చివరికి చేసేది లేక ఆ కంపెనీని మూసేస్తూ నిర్ణయం తీసుకున్న ఆ సంస్థ అధినేత డౌగ్ ఎవాన్స్. ఫలితంగా గూగుల్‌తో పాటు ఇతర సంస్థలు సైతం నష్టపోయేలా చేసింది.


