Ayushman Bharat Digital Mission :ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ ప్రారంభం, అది ఎలా పనిచేస్తుంది?

PM Narendra Modi will launch Ayushman Bharat Digital Mission  - Sakshi

దేశ పౌరుల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ఉదయం 11గంటలకు ప్రధాని కార్యాలయంలో జరిగే వర్చువల్‌ ఈవెంట్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ పథకాన్ని ప్రారంభించారు. 

గత ఏడాది ఆగస్ట్‌ 15న జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో నరేంద్ర మోదీ ‘ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌’ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పథకంలో భాగంగా దేశ ప్రజలకు హెల్త్‌ కార్డ్‌లతో పాటు హెల్త్‌ ఐడీలను అందించనున్నారు. వీటి ఆధారంగా ప్రజలు హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ను ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ వెబ్‌ సైట్‌లో అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. 

ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఆస్పత్రికి వెళ్లినా, లేదంటే ట్రీట్మెంట్‌ రికార్డ్‌లను పోగొట్టుకున్నా సంబంధిత సమాచారం ఈ వెబ్‌ సైట్‌లో భద్రంగా ఉంటుంది. ఆస్పత్రికి వెళ్లి హెల్త్‌ ఐడి చెబితే సరిపోతుంది. డైరెక్ట్‌గా సంబంధిత ఆస్పత్రి సిబ్బంది సదరు వ్యక్తి హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ను డిజిటల్‌ రూపంలో చూసే వీలుంటుంది. కొత్తగా ఆరోగ్య పరీక్షలు చేయాల్సి వస్తే.. ఆ వివరాల్ని వెబ్‌ సైట్‌లో పొందుపరచాల్సి ఉంటుంది.

పౌరులే కాదు
నేషనల్‌ హెల్త్‌ అథారిటీ నిర్వహిస్తున్న ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌లో పౌరులతో పాటు డాక్టర్లకు సైతం కేటగిరిని ఏర్పాటు చేసింది. పౌరుల ఆరోగ్య భద్ర రిత్యా ఈ కేటగిరిలో డాక్టర్ల ఇన్ఫర్మేషన్‌తో పాటు, ఆస్పత్రులు, క్లీనిక్‌ల డేటా ఉంటుంది.   

పైలట్‌ ప్రాజెక్ట్‌గా కింద
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ లో భాగంగా ప్రస్తుతం ప్రస్తుతం ఆరు కేంద్ర పాలిత ప్రాంతాలు అండమాన్ & నికోబార్, చండీగఢ్, దాద్రా & నాగర్ హవేలీ మరియు డామన్ & డయు, లడఖ్, లక్షద్వీప్ & పుదుచ్చేరిలలో టెస్ట్ రన్ చేస్తున్నారు.

చదవండి: PM Modi: వ్యాక్సిన్‌ ఒక సురక్ష చక్రం

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top