మోంట్రా నుంచి రెండు ఎలక్ట్రిక్‌ ట్రక్‌లు | Montra Electric Launches Aviator 350 350L Electric Trucks Prices Start at | Sakshi
Sakshi News home page

మోంట్రా నుంచి రెండు ఎలక్ట్రిక్‌ ట్రక్‌లు

May 10 2026 7:23 AM | Updated on May 10 2026 7:28 AM

Montra Electric Launches Aviator 350 350L Electric Trucks Prices Start at

చెన్నై: మురుగప్ప గ్రూప్‌లో భాగమైన మోంట్రా ఎలక్ట్రిక్‌ తాజాగా రెండు విద్యుత్‌ ట్రక్‌ వేరియంట్లను ప్రవేశపెట్టింది. ఎవియేటర్‌ 350 (32కేడబ్ల్యూహెచ్‌), ఎవియేటర్‌ 350ఎల్‌ (50కేడబ్ల్యూహెచ్‌) వీటిలో ఉన్నాయి. మొదటిది రోజుకు 140 కి.మీ. వరకు స్వల్ప దూర ప్రయాణాలకు అనువుగా ఉంటుందని సంస్థ తెలిపింది.

ఇక రెండోది దూరం ఎక్కువగా ఉండే నగరాల మధ్య లాజిస్టిక్స్‌ సేవల కోసం ఉపయోగపడుతుంది. దీని సరి్టఫైడ్‌ రేజ్‌ 300 కి.మీ.గా ఉండగా, వాస్తవ పరిస్థితుల్లో దాదాపు 200 కి.మీ పైగా రేంజిని ఇస్తుంది. వీటి ప్రారంభ ధరలు వరుసగా రూ. 14.58 లక్షలు, రూ. 16.86 లక్షలుగా ఉంటాయని సంస్థ వివరించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement