HDFC Report: బేస్‌ ఎఫెక్ట్‌ ప్రభావంతో 9.4 శాతం వృద్ధి

HDFC Report On Indian Economy And GDP Growth - Sakshi

2021–22 భారత్‌ ఎకానమీపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అంచనా

సెప్టెంబర్‌ త్రైమాసికంలో 7.8 శాతం 

2022–23లో 7.5 శాతం పురోగతి  

ముంబై: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) వృద్ధి రేటుపై బేస్‌ ఎఫెక్ట్‌ ప్రభావమే అధికమని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. 2022 మార్చితో ముగియనున్న ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ వృద్ధి రేటు 9.4 శాతంగా ఉంటుందని అంచనావేసింది. మొదటి త్రైమాసికంలో 20.1 శాతం వృద్ధి రేటు నమోదుకాగా, రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్‌) ఈ రేటు 7.8 శాతంగా ఉంటుందని పేర్కొంది.  ‘పోల్చుతున్న నెలలో’  అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో  ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్‌ ఎఫెక్ట్‌.  ఇక్కడ బేస్‌ 2020–21 ఆర్థిక సంవత్సరాన్ని పరిశీలిస్తే, కరోనా కష్టాలతో ఎకానమీలో అసలు వృద్ధి నమోదుకాకపోగా, 7.3 శాతం క్షీణత నమోదయిన సంగతి తెలిసిందే. నవంబర్‌ 30వ తేదీన రెండవ త్రైమాసిక ఫలితాలు రానున్న నేపథ్యంలో ప్రస్తుత ఎకానమీపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తాజా అంచనాలను పరిశీలిస్తే.. 
- రెండవ త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధికి గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లో బేస్‌ ప్రధాన కారణం. అప్పట్లో ఎకానమీ వృద్ధిలేకపోగా 7.4 శాతం క్షీణతను నమోదుచేసుకుంది.  
-    వరుస త్రైమాసికాల పరంగా చూస్తే, ఎకానమీ మెరుగ్గా వుండే వీలుంది. దీని ప్రకారం, 2020– 21లో ఎకానమీ 16.9 శాతం క్షీణిస్తే, రెండవ త్రైమాసికంలో 9.75% పెరిగే అవకాశం ఉంది.  
-    భారత్‌ ఎకానమీలో వెలుగురేఖలు స్పష్టమయ్యాయి. రవాణాలో నిషేధం పూర్తిగా తొలగిపోవడం, డిమాండ్‌ పుంజుకోవడం వంటి అంశాల నేపథ్యంలో పలు హైప్రీక్వెన్సీ ఇండికేటర్లు సానుకూల సంకేతాలను ఇస్తున్నాయి.  
-    2021–22 రెండవ త్రైమాసికంలో వ్యవసాయం, అటవీ, మత్స్య సంపద వృద్ధి రేటు 4 శాతం ఉంటుందని భావిస్తున్నాం. ఎకానమీలో ఈ  విభాగం వాటా దాదాపు 15 శాతంగా ఉంది.  
-    జీడీపీలో మరో 15 శాతం వాటా కలిగిన పరిశ్రమ విభాగం వృద్ధి 6.3 శాతం ఉంటుందని
సరళతర వడ్డీ రేట్లనే కొసాగించాలి - అసోచామ్‌
ఎకానమీ పూర్తి స్థాయిలో పురోగతి బాట పట్టే వరకూ సరళతర వడ్డీరేట్ల విధానాన్నే భారత్‌ కొనసాగించాలని ఇండస్ట్రీ సంస్థ అసోచామ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)కి విజ్ఞప్తి చేసింది. దేశంలో ద్రవ్యోల్బణం ప్రతికూల పరిస్థితులను అధిగమించాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే ఇందుకు వడ్డీరేట్ల పెంపును సాధనంగా ఎంచుకోకూడదని కోరింది. ‘ప్రస్తుత పాలసీ రేట్లను కొనసాగించడానికి ఆర్‌బీఐ,  దాని ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) ప్రశంసనీయమైన ప్రయత్నం చేశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అభివృద్ధి చెందిన కొన్ని ఆర్థిక వ్యవస్థలలోని కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్ల పెంపు అంశాన్ని పరిశీలిస్తున్నాయి. అయితే దీనిని ఆర్‌బీఐ అనుసరించబోదని,  తక్కువ వడ్డీ రేట్లనే కొనసాగిస్తుందని మేము ఖచ్చితంగా విశ్వసిస్తున్నాము‘ అని ఛాంబర్‌ ప్రకటన తెలిపింది. వ్యూహాత్మక నిల్వల వినియోగించుకోవడం ద్వారా క్రూడ్‌ ధరల నియంత్రణకు ప్రయత్నం చేయాలన్న అమెరికా, చైనా, జపాన్‌ వంటి చమురు దిగుమతి దేశాల నిర్ణయాన్ని అసోచామ్‌ స్వాగతించింది. బ్యాంకింగ్‌ వ్యవస్థలో అదనపు ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) ఉందని పేర్కొన్న ఇండస్ట్రీ బాడీ, అయితే రుణ వృద్ధి ఇంకా పుంజుకోవాల్సి ఉందని స్పష్టం చేసింది.  ప్రత్యేకించి ప్రైవేటు పెట్టుబడులు ఇంకా బలహీనంగానే ఉన్నాయని తెలిపింది. ఇప్పటికీ అంతంతమాత్రంగానే ఉన్న ప్రైవేటు పెట్టుబడులు, వడ్డీరేట్లు పెంచితే మరింత తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొంది. 

చదవండి: Goldman Sachs: 2021–22లో భారత్‌ జీడీపీ వృద్ధి 9.8%

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top