బంగారం రుణాలపై తాజా వడ్డీ రేట్లు ఇవే!

Gold Loan Interest Rates in Feb 2021 - Sakshi

బంగారం విషయంలో భారత ప్రజలకు ఎక్కువగా భావోద్వేగపరమైన సంబంధం ఉంటుంది. అందుకే ప్రజలు ఎక్కువగా బంగారం అమ్మటానికి ఇష్టపడరు. ఒకవేల ఏదైనా కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు డబ్బుల కోసం బంగారం తాకట్టుపెట్టి రుణాలు తెచ్చుకోవడానికి ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తారు. మన దేశంలో ప్రజలు కష్ట సమయాల్లో ఉన్నప్పుడు బంగారాన్ని ఒక ఆస్తిగా వాడుకోవటానికే ఇష్ట పడుతారు. అప్పులు ఇచ్చే వాళ్లు కూడా బంగారాన్ని మంచి తాకట్టు వస్తువుగా పరిగణిస్తారు. అందుకే కరోనా సమయంలో మణప్పురం గోల్డ్ లోన్ ఫైనాన్స్ లిమిటెడ్, ముత్తూట్ ఫైనాన్స్ వంటి నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు) ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మరింత ఎక్కువగా రుణాలు ఇస్తూ వాటిపై వడ్డీలు ఆర్జిస్తున్నాయి.

సాధారణంగా వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్ల కంటే బంగారం రుణాల వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. బంగారు నగలు, గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బిస్కిట్లను తాకట్టు పెడతారు కాబట్టి బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు ఇస్తుంటాయి. భవిష్యత్ లో వీటి ధరలు పెరుగుతుంటాయి కాబట్టి బ్యాంకులు కూడా త్వరగా రుణాలు ఇవ్వడానికి చూస్తాయి. వడ్డీ రేట్లు అనేవి బ్యాంకులు, ఫైనాన్సింగ్ సంస్థలను బట్టి మారుతూ ఉంటాయి. కస్టమర్ క్రెడిట్ హిస్టరీ ఆధారంగా ఈ వడ్డీ రేట్లు ఆధారపడి ఉంటాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సింగ్ సంస్థల కన్నా బ్యాంకుల్లోనే బంగారం రుణాల వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. తక్కువ వడ్డీకే బంగారం రుణాలు ఇస్తున్న ఎన్‌బీఎఫ్‌సీలు, బ్యాంకుల గురుంచి ఈ క్రింద తెలుసుకోండి.  

 • పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ - 7 శాతం. 
 • బ్యాంక్ ఆఫ్ ఇండియా- 7.35 శాతం. 
 • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 7.50 శాతం. 
 • బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర- 7.50 శాతం. 
 • కెనెరా బ్యాంక్- 7.65 శాతం. 
 • కర్నాటక బ్యాంక్- 8.38 శాతం. 
 • ఇండియన్ బ్యాంక్- 8.50 శాతం. 
 • యూకో బ్యాంక్- 8.50 శాతం. 
 • ఫెడరల్ బ్యంక్- 8.50 శాతం. 
 • పంజాబ్ నేషనల్ బ్యాంక్- 8.75 శాతం. 
 • యూనియన్ బ్యాంక్- 8.85 శాతం. 
 • జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్- 8.90 శాతం.
 • సెంట్రల్ బ్యాంక్- 9.05 శాతం. 
 • ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్- 9.25 శాతం. 
 • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్- 9.50 శాతం. 
 • బ్యాంక్ ఆఫ్ బరోడా- 9.60 శాతం. 
 • యెస్ బ్యాంక్- 9.99 శాతం. 
 • ఐసీఐసీఐ బ్యాంక్- 10 శాతం. 
 • ఇండస్ ఇండ్ బ్యాంక్- 10 శాతం. 
 • కొటక్ మహీంద్రా బ్యాంక్- 10.50 శాతం. 
 • ముత్తూట్ ఫైనాన్స్- 11.99 శాతం. 
 • మణప్పురం ఫైనాన్స్- 12 శాతం. 
 • యాక్సిస్ బ్యాంక్- 13 శాతం.చదవండి  

చదవండి: 

బంగారం కొనుగోలుదారులకు తీపికబురు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top