ట్విటర్ వేదికగా ఫ్లిప్‌కార్ట్‌పై యూజర్ల ఆగ్రహం..?

Flipkart reports outage, users to vent frustration on Twitter - Sakshi

నిన్న(జనవరి 3) మధ్యాహ్నం సమయంలో ప్రముఖ ఈ-కామర్స్ షాపింగ్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్‌ ఓపెన్ చేసిన చాలా మంది వినియోగదారులు అసౌకర్యానికి గురి అయ్యారు. కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్‌ను యాక్సెస్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు టెక్నికల్ సమస్యలు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. కొందరు వినియోగదారులకు "దయచేసి మళ్లీ ప్రయత్నించండి" అనే పాప్-అప్ ఫ్లిప్‌కార్ట్‌ హోమ్ పేజీలో కనిపించింది. ఇంకా చాలా మంది వినియోగదారులు ఆర్డర్లకు సంబంధించిన లావాదేవీ చరిత్రను యాక్సెస్ చేసుకోలేకపోయారు.

downdetector.in ప్రకారం, 59 శాతం మంది వెబ్‌సైట్‌ వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్‌ను యాక్సెస్ చేసుకోవడంలో సమస్యను ఎదుర్కొంటే, 24 శాతం మంది యాప్ వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్‌ను యాక్సెస్ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సైట్ హీట్ మ్యాప్ ప్రకారం.. ఢిల్లీ, లక్నో, చండీగఢ్, జైపూర్, పాట్నా, కోల్ కతా, కటక్, హైదరాబాద్, ఇండోర్, అహ్మదాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూరు, మదురై, ముంబై, నాసిక్, అహ్మదాబాద్, సూరత్ నగరాలకు చెందిన వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్‌ను యాక్సెస్ చేసుకోవడంలో ఎక్కువగా సాంకేతిక సమస్యలు ఎదుర్కొన్నారు. 

ఈ సమస్య గురుంచి ట్విటర్ వేదికగా నివేదిస్తూ చాలా మంది యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2022 ఇదే మొదటి సర్వర్ డౌన్ సమస్య అని కార్తీక్ పటేల్ కామెంట్ పెడితే, మరొక యూజర్ Something Went Wrong! అని పోస్టు చేశాడు. ఇంకొక యూజర్ ఈ సమస్యకు సంబంధించిన వీడియో పోస్టు చేశాడు.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top