Elon Musk: ఎలోన్ మస్క్ ఆసక్తికర ట్వీట్!

Elon Musk Says Starlink Could See Global Coverage By August - Sakshi

స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్ ఇంటర్నెట్ సర్వీస్ కంపెనీ స్టార్ లింక్ 69,420 మంది ఆక్టివ్ యూజర్లను చేరుకున్నట్లు, "వ్యూహాత్మకంగా ముఖ్యమైన పరిమితి"ని దాటినట్లు ఆసక్తికర ట్వీట్ చేశారు. మరొక ట్వీట్ లో ధ్రువ ప్రాంతాలు మినహా ఆగస్టు నాటికి ప్రపంచ కవరేజీని ప్రారంభించనున్నట్లు పోస్ట్ చేశారు. స్టార్ లింక్ కంపెనీ అధ్యక్షుడు గ్వైన్ షాట్ వెల్ ఇంటర్నెట్ సర్వీస్ సెప్టెంబర్ నాటికి ప్రపంచ కవరేజీని అందించనున్నట్లు చెప్పిన వారం తర్వాత మస్క్ ఈ ట్వీట్ చేశారు. మొత్తం 72 ఉపగ్రహాలు ఆగస్టులో క్రియాశీలం కానున్నట్లు మరో ట్వీట్ లో తెలిపారు.

అయితే, 69,420 సంఖ్యపై చాలా మంది రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. @StevenCravis ట్విట్టర్ వినియోగదారుడు 69,420 సంఖ్య వ్యూహాత్మకంగా ఎందుకు ముఖ్యమని అడిగారు. దానికి మస్క్ సమాధానం ఇవ్వలేదు. మరో ట్విట్టర్ యూజర్(@flcnhvy) ఎయిర్ లైన్ వై-ఫై ఎప్పుడు అందుబాటులోకి వస్తుందని అడిగారు. దీనికి మస్క్ ఇలా జవాబిచ్చారు.. "గల్ఫ్ స్ట్రీమ్ లో చాలా మంది ప్రజలకు సేవలందించే బోయింగ్ 737, ఎయిర్ బస్ ఎ320లలో టెస్టింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2020 అక్టోబర్‌లో ఏలోన్ మస్క్ టెస్లా మోడల్ ఎస్  69,420 డాలర్లకు లభిస్తున్నట్లు చెప్పినట్లు మరికొందరు ట్వీట్ చేశారు. అయితే, ఎలోన్ మస్క్ ఈ సంఖ్య (69,420) ఎందుకు అంత వ్యూహాత్మకంగా ముఖ్యమైనదని అన్నారో ఎవరికి అర్ధం కావడం లేదు.

చదవండి: బగ్‌ కనిపెట్టి రూ.22 లక్షలు గెలుచుకున్న 20 ఏళ్ల యువతి!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top