తెలుగుగడ్డపై సెంచరీ దాటిన డీజిల్‌

Diesel Price Crosses Rs 100 In Chittoor - Sakshi

హైదరాబాద్‌ : పెట్రోలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరిగాయంటూ మరోసారి ధరలు పెంచాయి చమురు కంపెనీలు. ఈసారి లీటరు పెట్రోలుపై రూ. 43 పైసలు, లీటరు డీజిల్‌పై రూ. 34 పైసుల వంతున ఛార్జీలు పెంచాయి. ఇలా వరుసగా పెరుగుతున్న ధరలతో తెలుగు గడ్డపై లీటరు డీజిల్‌ ధర​ సెంచరీ దాటింది. ఏపిలో చిత్తూరు జిల్లాలో లీటరు డీజిల్‌ ధర రూ. 100.25కి చేరుకుంది. ఇక్కడ పెట్రోలు ధర 107.82గా ఉంది. మిగిలిన జిల్లాలలో సెంచరీకి చేరువగా వచ్చింది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు రూ. 104.93, లీటరు డీజిల్‌ 98.02గా ఉంది.

ఇదే అత్యధికం
జులైలో నెలలో ఇప్పటి వరకు ఆరు సార్లు పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగాయి. గరిష్టంగా లీటరు పెట్రోలుపై 36 పైసలు అత్యధికంగా ధర పెరిగింది. కానీ శనివారం పెరిగిన ధరల్లో లీటరు పెట్రోలుపై 43 పైసల వంతున ధర పెంచారు. 

ఇంకా పెరగొచ్చు
ఒపెక్‌ దేశాల వైఖరితో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. దీనికి తగ్గట్టే రాబోయే రోజుల్లో దేశీయంగా పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరగడం ఖాయంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏమైనా చర్యలు తీసుకుంటే తప్ప పెట్రోలు, డీజిల్‌ ధరలు ఇప్పట్లో తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top