
రోజురోజుకి పెరిగిపోతున్న పర్యావరణ కాల్యుషం నియంత్రించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించాలంటూ ప్రభుత్వాలు, స్వచ్చంధ సంస్థలు ఎంతగా మొత్తుకున్నా క్షేత్రస్థాయిలో ఫలితాలు అంతంత మాత్రంగానే ఉండేవి. అయితే ఓలా రాకతో పరిస్థితులు మారిపోయాయి. భవీశ్ అగర్వాల్ ఎంతో ముందు చూపుతో తెచ్చిన ఓలా స్కూటర్లు దేశంలో హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. ప్రీ బుకింగ్‌లోనే లక్షకు పైగా ఆర్డర్లు సాధించింది. ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీలో రోజుకు వెయ్యికి పైగా బైకులు తయారు చేస్తూ.. డెలివరీ చేస్తున్నా ఇంకా ఓలాకి డిమాండ్ తగ్గడం లేదు. ఓలా బైకు తమ చేతికి వస్తే కస్టమర్లు సంబరాలు చేసుకుంటున్నారు.
ఇటీవల ఓలా స్కూటర్‌ను సెంటర్ ఆఫ్ ఎట్రాక‌్షన్‌గా పెట్టుకుని మన దగ్గర బతుకమ్మ. భోగిమంటల చుట్టు నృత్యం చేసినట్టుగా యువతీ యువకులు సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు. దానికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఓలా ఫౌండర్ భవీశ్ అగర్వాల్ ఆ వీడియోను షేర్ చేస్తూ... ఓలా స్కూటర్‌ను తయారు చేసినప్పుడు దీన్ని ఇలా కూడా ఉపయోగిస్తారని అస్సలు అనుకోలేదంటూ ఆశ్చర్యంతో కూడిన ఆనందం వ్యక్తం చేశారు. తన మదిలో మెదిలిన చిన్న ఆలోచన అనూహ్యమైన రేంజ్‌లో సక్సెస్ కావడం పట్ల భవీశ్ అగర్వాల్ ఆనందంలో మునిగితేలుతున్నాడు.
Never thought of this use case while designing it😄❤️ https://t.co/y5JQWveH0r
— Bhavish Aggarwal (@bhash) June 25, 2022
చదవండి: వావ్! ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాలు తగ్గినా.. కళ్లు తిరిగే ఆదాయం