Anand Mahindra Most Often Have Used Tamil Word Poda Dei - Sakshi
Sakshi News home page

Anand Mahindra: ఈ తమిళ పదం.. వంద ఆంగ్ల పదాలకు సమానం

Jan 15 2022 11:13 AM | Updated on Jan 15 2022 3:24 PM

Anand Mahindra most often have used Tamil Word Poda dei - Sakshi

సమకాలిన అంశాలపైనే కాదు విభిన్న విషయాలపై సోషల్‌ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు స్పందిస్తుంటారు ఆనంద్ మహీంద్రా. కాగా సంక్రాంతి పండగ వేళ తన చిన్ననాటి సంగతులు గుర్తు చేసుకుంటూ మనందరికి బాగా తెలిసిన పోడా.. డేయ్‌ అనే తమిళ పదాన్ని తెర మీదకు తెచ్చి నెట్టింట్ట నవ్వులు పూయించారు. 

చిన్నప్పుడు తాను తమిళనాడులో చదువుకున్నప్పుడు మొదటగా తెలుసుకున పదం పోడా.. డేయ్‌ అని చెప్పారు. అంతేకాదు ఈ పదాన్ని తన జీవితంలో ఎన్నో సార్లు ఉపయోగించానని, అయితే కొన్ని సార్లు గట్టిగా చెప్పగా చాలా సార్లు లోలోపలే అనుకున్నట్టుగా చెబుతూ.. అనేక ఇంగ్లీష్‌ పదాలకు సమానంగా నిలిచే ఓ తమిళ పదాన్ని పోల్చుతూ ఓ ఫోటో పోస్ట్‌ చేశారు. 

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని విభిన్న పద్దతుల్లో విషెస్‌ చెబుతున్నారు ఆనంద్ మహీంద్రా. భోగి పండుగ రోజు వివిధ రాష్ట్రాల్లో ఈ పండుగని ఎలా పిలుస్తారో చెబుతూ ఓ ఫోటోని ఆయన షేర్‌ చేశారు. కాగా పొంగల్‌ రోజున పొడా.. డేయ్‌ అనే తమిళ పదంతో తన చిన్న నాటి సంగతులు గుర్తు చేసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement