
సోషల్ మీడియా వేదికగా సామాజిక అంశాలపై స్పందించడమే కాదు తమ కంపెనీ ప్రొడక్టులను ప్రమోట్ చేసుకుంటారు ఆనంద్ మహీంద్రా. ఈ క్రమంలో మోర్ అటెన్షన్ సాధించేందుకు ఫన్నీగా ఆయన కామెంట్టు కూడా పెడుతుంటారు. అవి నెట్టింట వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా ఓ యాడ్ షూటింగ్ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు.
మమీంద్రా ట్రక్‌బస్ కోసం చేపట్టిన షూట్‌లో.. పదే పదే స్ట్రిప్ట్‌లో మార్పులు ఎందుకు చేస్తున్నారంటూ అసహనంగా అడుగుతాడు అజయ్ దేవ్‌గన్.. పదే పదే మార్పులు చేయడం లేదు సార్ ఓ సాలుగైదు సార్లు అంతే అంటూ ఓ గొంతు వినిపిస్తుంది. వెంటనే కెమెరావైపు ఓ సీరియస్ లుక్ ఇస్తాడు అజయ్ దేవ్‌గన్.
I was informed that @ajaydevgn lost his cool on a @MahindraTrukBus film shoot. I better leave town before he comes after me in one our trucks… pic.twitter.com/roXY7hIfRN
— anand mahindra (@anandmahindra) February 14, 2022
ఈ వీడియోకు ఆనంద్ మహీంద్రా కామెంట్ రాస్తూ.. మహీంద్రాట్రక్‌బస్ షూటింగ్‌లో అజయ్ దేవగన్‌కి కోపం వచ్చినట్టు నాకు తెలిసింది. మా ట్రక్ బస్ వేసుకుని ఆయన నా కోసం వచ్చేలోగా.. ఊరొదిలి పారిపోతానంటూ చమత్కరించారు ఆనంద్ మహీంద్రా.