అందరి దృష్టీ సర్‌ పైనే | - | Sakshi
Sakshi News home page

అందరి దృష్టీ సర్‌ పైనే

Jun 19 2026 12:24 AM | Updated on Jun 19 2026 12:24 AM

8లో

న్యూస్‌రీల్‌

కమ్యూనిస్టులే మిగిలారు

అసలేం జరుగుతోంది..?
శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి కొత్త ప్రణాళికను ప్రభుత్వం బయటకు వెల్లడించడం లేదు.

శుక్రవారం శ్రీ 19 శ్రీ జూన్‌ శ్రీ 2026

రాజకీయ పార్టీల్లో సర్‌ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) కార్యక్రమం ప్రకంపనలు రేపుతోంది. అప్రమత్తంగా లేకపోతే ముప్పు తప్పదనే భావన ప్రధాన రాజకీయ పక్షాల్లో నెలకొంది. నిన్నా మొన్నటి వరకు సర్‌ విషయంలో చూసీచూడనట్టుగా ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పుడు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం

జాగ్రత్త పడుతున్న పార్టీలు

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపడుతోంది. అయితే, సదుద్దేశంతో చేపట్టిన ‘సర్‌’ ప్రక్రియను కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి తనకు అనుకూలంగా మార్చుకుని, సంప్రదాయంగా తమకు ఓటు బ్యాంకు లేని వర్గాల ఓట్లను తొలగిస్తోందనేది విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అయితే ఇటీవల వెలువడిన తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అన్ని రాజకీయ పక్షాలను రక్షణాత్మక ధోరణిలోకి నెట్టివేశాయి. తమిళనాడులో మళ్లీ అధికారం తమదే అనుకున్న డీఎంకేకు షాక్‌ తగిలింది. ఆ పార్టీ చీఫ్‌, సీఎం హోదాలో పోటీ చేసిన స్టాలిన్‌ సైతం ఓడిపోయాడు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నాయత్వంలోని టీఎంసీ మట్టి కరిచింది. ఈ ఫలితాల తర్వాత ఒక్కసారిగా రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పక్షాలైన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు అప్రమత్తమయ్యాయి. సర్‌ను తేలిగ్గా తీసుకునేందుకు వీలు లేదని, తమ ఓటు బ్యాంకును కాపాడుకోవాలని రంగంలోకి దిగాయి.

రూటు మార్చిన కాంగ్రెస్‌

సర్‌ కార్యక్రమంపై క్షేత్రస్థాయి నుంచి నియోజకర్గస్థాయి వరకు పార్టీ కేడర్‌కు అవగాహన కల్పించాలని కాంగ్రెస్‌ ఏప్రిల్‌ మొదటి వారంలో నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ నియోజకర్గాల వారీగా ఇన్‌చార్జీలను కూడా నియమించింది. ఇటీవల వరకు వీరు మొక్కుబడి సమావేశాలకే పరిమితమైనా.. ప్రస్తుతం హస్తం పార్టీ యాక్షన్‌ ప్లాన్‌లో మార్పు వచ్చింది. దీంతో జూన్‌ 10న ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశాన్ని కొత్తగూడెంలో నిర్వహించారు. హైదరాబాద్‌ నుంచి నిపుణులను తీసుకువచ్చి, పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సర్‌ గురించి ఆ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, బూత్‌ లెవల్‌ ఆఫీసర్లకు వివరించే ప్రయత్నం చేశారు.

గేరు మార్చిన ‘కారు’

అధికారం కోల్పోయిన తర్వాత నైరాశ్యంలో ఉన్న గులాబీ శ్రేణుల్లో సర్‌ కొత్త ఊపును తీసుకొచ్చి నట్టయ్యింది. జిల్లా ఇన్‌చార్జిగా నియమితులైన ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావులు సర్‌ విషయంలో కేడర్‌ను అప్రమత్తం చేసే పనిలో ఉన్నారు. సర్‌లో కీలకమైన బూత్‌ లెవల్‌ ఏజెంట్ల నియామకం పట్ల రవీందర్‌రావు నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగూడెంలో గురువారం నిర్వహించిన అవగాహన సదస్సులో మండలాల వారీగా బూత్‌ లెవల్‌ ఏజెంట్లను స్వయంగా పరిచయం చేసుకున్నారు. అలసత్వం వహించొద్దని సూచించారు. ఈ క్రమంలో రవీందర్‌రావు స్థానిక నాయకులు, కేడర్‌ను ఉద్దేశించి కఠినంగా మాట్లాడటం విమర్శలకు దారి తీసింది. అయినా పార్టీని బలోపేతం చేయాలంటే ముక్కుసూటిగా వ్యవహరించకతప్పదని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర చెప్పడం.. ‘సర్‌’ పట్ల బీఆర్‌ఎస్‌ అగ్రనాయకత్వం ఎంత అలెర్ట్‌గా ఉందనే విషయాన్ని తేటతెల్లం చేస్తోంది.

ఆది నుంచి కమ్యూనిస్టు పార్టీలు సీపీఐ, సీపీఎం, సీపీఐ–ఎంఎల్‌లకు జిల్లాలో బలమైన ఓటు బ్యాంకు ఉంది. పైగా, బీజేపీని సిద్ధాంతపరంగా వ్యతిరేకించడంలో కమ్యూనిస్టులు మిగిలిన రాజకీయ పార్టీల కంటే ముందువరుసలో ఉంటారు. కానీ, కమ్యూనిస్టు పార్టీల నుంచి ‘సర్‌’ కార్యాచరణపై ప్రకటన రాకపోవడం గమనార్హం. సర్‌ మ్యాపింగ్‌ ప్రక్రియ 25 నుంచి మొదలుకానుంది. ఇప్పటికే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు తమ కేడర్‌ను అప్రమత్తం చేసే పనిని మొదలు పెట్టాయి. సర్‌ మీద ప్రజల్లో చైతన్యం పెరిగేలా చేయడంపై కమ్యూనిస్టులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement