సీనియారిటీ ఆధారంగా కౌన్సెలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

సీనియారిటీ ఆధారంగా కౌన్సెలింగ్‌

Jun 19 2026 12:24 AM | Updated on Jun 19 2026 12:24 AM

చుంచుపల్లి: సాధారణ బదిలీల్లో భాగంగా జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కేటాయించిన 54 మంది ఏఎన్‌ఎంలకు పారదర్శకంగా కౌన్సెలింగ్‌ నిర్వహించినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యఅధికారి డాక్టర్‌ తుకారాం రాథోడ్‌ తెలిపారు. గురువారం తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అనంతరం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అర్బన్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ సెంటర్లలో పనిచేసే సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 28న నిర్వహించనున్న పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రతాప్‌, శ్రీధర్‌, కళ్యాణి, మోహన్‌, శ్రీనివాస్‌, జానకి, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement