రెక్కీ నిర్వహించి.. రూ.లక్ష కొట్టేశారు | - | Sakshi
Sakshi News home page

రెక్కీ నిర్వహించి.. రూ.లక్ష కొట్టేశారు

Jun 19 2026 12:24 AM | Updated on Jun 19 2026 12:24 AM

నేలకొండపల్లి: వ్యవసాయ పనుల నిమిత్తం బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్న ఓ రైతును వెంబడించిన దుండగులు ఆయన నుంచి రూ.లక్ష నగదు తస్కరించారు. నేలకొండపల్లి మండలం బైరవునిపల్లికి చెందిన కాసాని తిరపయ్య వ్యవసాయం పెట్టుబడుల కోసం ఓ బ్యాంక్‌లో బంగారం తాకట్టు పెట్టి ఇటీవల రూ.లక్ష రుణం తీసుకున్నారు. విత్తనాల కొనుగోలుకు గురువారం రూ.లక్ష డ్రా చేయగా, ఆయనను వెన్నంటి గమనిస్తున్న దుండగులు కిరాణం షాప్‌ వద్ద రైతు నగదు ఉన్న సంచిని మోపెడ్‌కు తగిలించి వెళ్లడంతో కొట్టేశారు. తిరిగి వచ్చే సరికి రైతు బ్యాగ్‌ లేదని గుర్తించి బోరున విలపిస్తూ ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కిరాణం షాప్‌ వద్ద రైతు నుంచి బ్యాగ్‌ చోరీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement